అప్పట్లో సాయి పల్లవికి వున్న క్రేజ్ రీత్యా ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో శర్వానంద్ హిట్ కొట్టేస్తాడనే అనుకున్నారు. కానీ ఆ చిత్రం సెకండాఫ్ సిండ్రోమ్‍కి గురయి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. అయితే శర్వా, సాయి పల్లవి జంట బాగుందనే టాక్ వరకు తెచ్చుకోగలిగింది. ఈ జంటను మళ్లీ తెర మీదకు తెచ్చే ప్రయత్నాల్లో వున్నాడట కిషోర్ తిరుమల.
చిత్రలహరి తర్వాత రామ్‍తో రెడ్ తీసిన కిషోర్ ఆమధ్య వెంకటేష్‍తో ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ అనే సినిమా చేద్దామని చూసాడు. కానీ ఎందుకో ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు అదే కథను శర్వానంద్‍కు అనుగుణంగా మార్చి అతడికి చెప్పాడని, శర్వానంద్‍కి కథ నచ్చిందని సమాచారం. శ్రీకారం, మహాసముద్రం సినిమాల తర్వాత శర్వానంద్ ఇదే సినిమా మొదలు పెడతాడట. ఈ చిత్రంలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ కనుక సాయి పల్లవి అయితే బెస్ట్ అని కిషోర్ భావిస్తున్నాడట.
ఇప్పటికే ఆమెతో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారని, ఆమె పూర్తి కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే ఈ ప్రాజెక్ట్ అఫీషియల్‍గా అనౌన్స్ అవుతుందని వార్తలొస్తున్నాయి. కొంత కాలం పాటు సాయి పల్లవి డిమాండ్ తగ్గినట్టే అనిపించినా ఇప్పుడు చాలా సినిమాలకు ఆమెనే కథానాయికగా కన్సిడర్ చేస్తున్నారు. పర్‍ఫార్మెన్స్ కి స్కోప్ వున్న క్యారెక్టర్ అనగానే సాయి పల్లవినే ప్రిఫర్ చేస్తున్నారు.
This post was last modified on September 29, 2020 3:47 pm
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…