Movie News

కొత్త హీరో లాంచింగ్.. ఎన్ని కోట్లు పోశారో

హీరోయిన్‌గా రెజీనా కసాండ్రా.. ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, నాజర్, బ్రహ్మానందం, ఆలీ.. ఇంకా చాలామంది ప్రముఖ తారాగణం. సంగీతం అందించింది అనూప్ రూబెన్స్ అయితే.. రసూల్ ఎల్లోర్ లాంటి ఫేమస్ సినిమాటోగ్రాఫర్ ఛాయాగ్రహణ బాధ్యతలు చూసుకున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్‌కు కూడా ఢోకా ఏమీ లేదు. ఒక కొత్త హీరో లాంచింగ్ కోసం ఇలా ప్యాడింగ్ గట్టిగానే చేశారు. కానీ ఇన్ని ఉన్నా కథలో విషయం లేకపోవడం, ఔట్ డేటెడ్ నరేషన్ పుణ్యమా అని ‘ఉత్సవం’ అనే సినిమా పేలవంగా తయారైంది.

దిలీప్ ప్రకాష్ అనే కొత్త హీరోను పరిచయం చేస్తూ అర్జున్ సాయి అనే డెబ్యూ డైరెక్టర్ తీసిన సినిమా ఇది. శుక్రవారం ‘మత్తువదలరా’, ‘భలే ఉన్నాడే’తో పాటుగా ఈ మూవీ కూడా రిలీజైంది. హీరో కొత్తవాడైనా కలర్ ఫుల్ ప్రోమోలు.. ఆకర్షణీయ కాస్టింగ్ వల్ల ఈ సినిమా కొంతమేర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

ఐతే కనుమరుగైపోతున్న నాటక కళను కొత్త తరానికి పరిచయం చేసి దానికి పూర్వ వైభవం తీసుకురావడం అనే బ్యాక్‌డ్రాప్‌లో ఒక ప్రేమకథను నరేట్ చేయాలన్న దర్శకుడి ఉద్దేశం మంచిదే అయినా.. తలా తోకా లేకుండా సాగే కథనం.. ఔట్ డేటెడ్ నరేషన్ కారణంగా ఈ చిత్రం ఎందుకూ కొరగాకుండా పోయింది. ఒక సీన్‌కు ఇంకో సీన్‌కు సంబంధం లేకుండా సాగుతూ సినిమా బాగా బోర్ కొట్టించేసింది. బహుశా ఇది హీరో సొంత ప్రొడక్షన్ అయి ఉండొచ్చు.

ఖర్చుకు వెనకాడకుండా పేరున్న నటీనటులు, టెక్నీషియన్లను తీసుకుని అన్ని హంగులూ జోడించినా.. కథాకథనాల మీద శ్రద్ధ పెట్టకపోవడంతో పేరులో ఉన్న ‘ఉత్సవం’ సినిమాలో లేక ప్రేక్షకులు నీరసించిపోయారు. ఐతే సినిమా చూసిన వాళ్లు మాత్రం ఏ బ్యాగ్రౌండ్ లేని హీరోను లాంచ్ చేస్తూ చిన్న స్థాయిలో చూసుకోకుండా విషయం లేని కథ మీద ఇంత ప్యాడింగ్ జోడించి కోట్లు వృథా చేశారే అని ఫీలయ్యే పరిస్థితి.

This post was last modified on September 14, 2024 2:23 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

33 minutes ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

1 hour ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

1 hour ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

2 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

2 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

3 hours ago