మేమంతా ఒకటేనని టాలీవుడ్ హీరోలు వేదికలెక్కి మరీ మొత్తుకున్నా చాలా మంది అభిమానులు దాన్ని అర్థం చేసుకోవడం లేదు. సోషల్ మీడియా చేతిలో ఉంది కదాని వీలైనంత బురద జల్లి, సినిమా ఫలితాన్ని మేమేదో శాశించగలం అనే భ్రమలో ఉండిపోతున్నారు. దేవర ట్రైలర్ మీద రెండు రోజులుగా జరుగుతున్న డిబేట్ చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. పట్టుమని మూడు నిముషాలు కూడా లేని వీడియోని పట్టుకుని ఏకంగా బాక్సాఫీస్ తీర్పులు ఇచ్చేస్తున్నారు. యూట్యూబ్ వ్యూస్ ని ఆధారంగా చేసుకుని ఏదో ఋజువు చేయాలని అక్కర్లేని ప్రయత్నం చేస్తున్నారు. మాటల దాడులు తీవ్రతరం చేస్తున్నారు.
మా హీరో సినిమా వచ్చినప్పుడు మీరు ట్రోలింగ్ చేశారు కాబట్టి దానికి రెట్టింపు మీ హీరోది రిలీజైనప్పుడు మేమూ చేస్తామని అనుకోవడం మూర్ఖత్వం. బాగున్న మూవీని ఏదో ఒక వర్గం లేదా సమూహం ప్రభావితం చేసి హిట్టు లేదా ఫ్లాపు చేసిన దాఖలాలు చరిత్రలో లేవు. బాగుంటే వద్దన్నా ప్రేక్షకులు వస్తారు. నొక్కి చెప్పకపోయినా థియేటర్లకు ఎగబడతారు. గత నెల రవితేజ, రామ్ లు చేతులు ఎత్తేస్తే స్వాతంత్ర దినోత్సవానికి హిట్లు ఇచ్చింది కుర్ర హీరోలు, కొత్త దర్శకులే కదా. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లు కేవలం స్టార్లు చేశారని ఆడినవి కాదు. అలాంటప్పుడు సామాజిక మాధ్యమాల్లో వాదులాడుకోవడం అర్థరహితం.
ఈ సమస్య ఇప్పుడిది కాదు. కేవలం తారక్, చరణ్ ఫ్యాన్స్ మధ్య మాత్రమే జరుగుతున్నది కాదు. సందర్భాన్ని బట్టి అందరి అభిమానులు వీటిలో భాగమవుతున్న వాళ్లే. ట్రోలింగ్ చేస్తేనో లేదా దర్శకులను హీరోలను ఎగతాళి చేస్తేనే తమకేదో గొప్ప తెలివి తేటలు ఉన్నట్టు ఫీలవ్వడం కన్నా అమాయకత్వం మరొకటి ఉండదు. ఈ రోజు దేవర. రేపు పుష్ప 2. ఆ తర్వాత గేమ్ ఛేంజర్, అటుపై విశ్వంభర, బాలయ్య 109 ఇలా ఈ చైన్ కొనసాగుతూనే ఉంటుంది. రాజకీయాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఎంతో అన్యోన్యంగా ఉండే స్టార్లను చూసైనా అభిమానులు మారాల్సిన అవసరం ఉంది. లేదంటే తర్వాతి తరాలు ప్రభావితం చెందుతాయి.
This post was last modified on September 12, 2024 3:04 pm
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్‌కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…