స్టార్ హీరోయిన్లు మామూలుగా పెద్ద హీరోల సినిమాల్లోనే చేస్తుంటారు. మిడ్ రేంజ్, అప్ కమింగ్ హీరోల పక్కన వాళ్లను సెట్ చేయడం అంత తేలిక కాదు. వాళ్ల ఇమేజ్‌కు సూట్ కాదని కావచ్చు.. అలాగే బడ్జెట్ పరిమితుల వల్ల కావచ్చు.. ఇలాంటి కాంబినేషన్లు కుదరవు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల్లో మాత్రం ఇది మినహాయింపు. తన తొలి చిత్రంలోనే సమంత లాంటి టాప్ హీరోయిన్‌తో జట్టు కట్టాడు. అందులో తమన్నా భాటియా ఐటెం సాంగ్ చేసింది. ఆపై రకుల్ ప్రీత్, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్.. ఇలా వరుసగా టాప్ హీరోయిన్లతో సినిమాలు చేశాడు.
తన రేంజికి ఇలాంటి కథానాయికలతో జట్టు కట్టడం ఆశ్చర్యం కలిగించే విషయమే. కానీ తన కోసం తండ్రి బెల్లంకొండ సురేష్. భారీ పారితోషకాలు ఇచ్చి మరీ స్టార్ హీరోయిన్లను సినిమాల కోసం సెట్ చేస్తుంటాడని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. మధ్యలో కొంచెం రేంజ్ తగ్గించి అనుపమ పరమేశ్వరన్, నభా నటేష్ లాంటి మిడ్ రేంజ్ హీరోయిన్లతో సినిమాలు చేశాడు శ్రీనివాస్.
కానీ తన కొత్త సినిమాకు మళ్లీ టాప్ హీరోయిన్‌నే ఎంచుకున్నాడు. భీమ్లా నాయక్, బింబిసార, విరూపాక్ష లాంటి సినిమాలతో టాలీవుడ్లోకి దూసుకొచ్చి.. టాప్ హీరోయిన్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్న సంయుక్త..శ్రీనివాస్‌కు జోడీగా నటించబోతోంది. బుధవారం సంయుక్త పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి పోస్టర్లు రిలీజ్ చేశారు. అందులో స్వయంభుతో పాటు శర్వానంద్ కొత్త సినిమా.. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ కూడా ఉన్నాయి.
శ్రీనివాస్ 12వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీని లుధీర్ బైరెడ్డి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్నాడు. మహేష్ చందు నిర్మాత. ఈ సినిమా నుంచి సంయుక్త మోడర్న్ లుక్‌ను చిత్ర బృందం ఫస్ట్ లుక్‌గా లాంచ్ చేస్తూ ఆమెకు బర్త్ డే విష్ చెప్పింది. దీంతో సరైన విజయాలు లేకపోయినా.. శ్రీనివాస్ మరోసారి టాప్ హీరోయిన్‌తో సినిమా చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on September 12, 2024 10:05 am
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…