‘బాహుబలి’తో ప్రభాస్ సాధించిన స్టార్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్‌ను ఇంకెవ్వరూ మ్యాచ్ చేయలేరన్నది వాస్తవం. కానీ ఆ స్థాయిలో కాకపోయినా ‘ఆర్ఆర్ఆర్’తో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ కూడా ఎంతగానో పెరిగాయన్నది వాస్తవం. ఆ విషయంలో తారక్, చరణ్‌ల తర్వాతి సినిమాల విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది.
తారక్ విషయానికి వస్తే.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత వస్తున్న ‘దేవర’కు పాన్ ఇండియా స్థాయిలో మంచి హైప్ వచ్చింది. దీని బడ్జెట్, బిజినెస్ అన్నీ కూడా వేరే లెవెల్లో కనిపిస్తున్నాయి. రేప్పొద్దున సినిమాకు వచ్చే ఓపెనింగ్స్ కూడా అందుకు తగ్గట్లే ఉండొచ్చనడంలో సందేహం లేదు. ఇదే సమయంలో పాన్ ఇండియా స్థాయిలో మరింతగా తన మార్కెట్‌ను విస్తరించే దిశగా ప్రణాళిక ప్రకారం అడుగులు వేస్తున్నాడు తారక్.
‘కేజీఎఫ్’; ‘సలార్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా అంటే పాన్ ఇండియా స్థాయిలో పెద్ద రేంజిలోనే ఉంటుంది. మరోవైపు నేరుగా బాలీవుడ్లో హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్-2’ చేస్తున్నాడు తారక్. అది జూనియర్ కెరీర్లో ఒక కీలక మలుపు అవుతుందని భావిస్తున్నారు. మరోవైపు ‘దేవర’ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేస్తున్న కరణ్ జోహార్ సైతం తారక్‌తో నేరుగా ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. నిన్న ముంబయిలో ‘దేవర’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని చెప్పకనే చెప్పాడు.
తారక్ తనకు బాగా క్లోజ్ అని చెబుతూ.. తమ ప్రయాణం ఇప్పుడే మొదలైందని, మున్ముందు చాలా చూస్తారని చెబుతూ.. తాను దేని గురించి మాట్లాడుతున్నానో తారక్‌కు కూడా తెలుసు అంటూ తమ కలయికలో ఓ సినిమా రాబోతున్న విషయాన్ని చూచాయిగా చెప్పాడు. కరణ్ ప్రొడక్షన్ నుంచి రిలీజయ్యే సినిమా అంటే పాన్ ఇండియా స్థాయిలో బాగా మార్కెట్ చేస్తారు. కాబట్టి ‘దేవర’లో విషయం ఉంటే హిందీలోనూ పెద్ద రేంజికి వెళ్లొచ్చు. ఆ తర్వాత వార్-2, కరణ్ జోహార్ సినిమాలు వచ్చాయంటే తారక్ పాన్ ఇండియా స్థాయిలో పెద్ద స్టార్‌గా అవతరించడం ఖాయం.
This post was last modified on September 12, 2024 10:01 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…