Movie News

బ్రహ్మానందం సీరియస్ యాంగిల్ వాడుకోండి

లెజెండరీ కమెడియన్ గా బ్రహ్మనందంని వెయ్యికి పైగా సినిమాల్లో చూసి ఆయనని కేవలం హాస్యానికి కేరాఫ్ అడ్రెస్ అనుకుంటాం కానీ నిజానికి తను ఎంత గొప్ప సీరియస్ నటుడో ప్రపంచానికి పరిచయం చేయాలని చూసింది కొందరే. ఆ మధ్య కృషవంశీ రంగమార్తాండలో ఒక్క జోకు వేయకుండా మంచం మీద చనిపోయే సన్నివేశంలో ప్రకాష్ రాజ్ ని పూర్తిగా సైడ్ చేసేలా ఎంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారో గుర్తుందిగా. ఎల్లుండి విడుదల కాబోతున్న ఉత్సవం అనే చిన్న సినిమాలో దుర్యోధనుడి వేషంలో ఎస్వి రంగారావులా ఏకధాటిగా డైలాగు చెప్పడం ట్రైలర్ లో చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు.

ఇప్పుడే కాదు గతంలోనూ బ్రహ్మి ఇలాంటి ప్రయత్నాలు కొన్ని చేశారు. ముప్పై సంవత్సరాల క్రితం జంధ్యాల తీసిన బాబాయ్ హోటల్ లో ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయి. క్లైమాక్స్ వచ్చేసరికి బ్రహ్మానందం నటనకు కళ్ళు చెమర్చని వారు ఉండరు. ఉషాకిరణ్ మూవీస్ తీసిన అమ్మలో చేసింది చిన్న పాత్రే అయినా హృదయాన్ని తాకేలా ప్రదర్శించిన నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కాకపోతే ఎప్పటికప్పుడు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే పాత్రలే ఎక్కువ వర్కౌట్ కావడంతో దర్శక రచయితలు బ్రహ్మానందంలోని మరో యాంగిల్ ని వాడుకునే దిశగా ఆలోచించలేదు.

వయసుని పట్టించుకోకుండా ఇప్పుడు కూడా కెమెరా ముందుకొచ్చేందుకు రెడీగా ఉండే బ్రహ్మానందం గారికి ఆయన స్థాయికి తగ్గ క్యారెక్టర్లు పడక కొన్ని సినిమాల్లో మరీ మొక్కుబడిగా మారిపోయాయి. ఉత్సవంలో రంగస్థల నటుడిగా డిఫరెంట్ షేడ్ దక్కింది. డిసెంబర్ లో కొడుకు గౌతమ్ తో కలిసి నటించిన బ్రహ్మ ఆనందంలోనూ మంచి స్కోప్ ఉంటుందని ఇన్ సైడ్ టాక్. కల్కి లాంటి ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లోనే సరిగా వాడుకోలేదు కానీ చిన్న చిత్రాలు మాత్రం బ్రహ్మి వల్లే తమ గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి. ఇకపై స్టార్ హీరోలు సైతం తగిన ప్రాధాన్యం ఇస్తే వింటేజ్ బ్రహ్మిని చూసుకోవచ్చు.

This post was last modified on September 11, 2024 12:27 pm

Share

Recent Posts

బెంగాల్ రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు

ప‌శ్చిమ బెంగాల్‌లో సుదీర్ఘ‌కాలం పాటు పాల‌న సాగించిన తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప‌రాజ‌యం…

21 minutes ago

వ‌రంగల్‌కు ఎయిర్‌పోర్టు… ఆ పేర్లు పెట్ట‌మ‌న్న‌ సందీప్ వంగ

ఎయిర్‌పోర్టులంటే పెద్ద సిటీల్లోనే ఉండాల‌నే నియ‌మాలేమీ లేవిప్పుడు. టైర్-2 సిటీలు, ప‌ట్ట‌ణాల‌కు కూడా విమానాశ్ర‌యాలు విస్త‌రిస్తున్నాయి. ఐతే మ‌రో తెలుగు…

38 minutes ago

‘రాకా’ అనిరుధ్ లేదా జి.వి.ప్రకాష్ అనుకుని…

‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను ఏ…

41 minutes ago

ఈ క్లారిటీ ముందే ఉండాల్సింది డైరెక్టర్ గారు

టాలీవుడ్ యువ న‌టుడు సుహాస్ న‌టించిన త‌మిళ చిత్రం మండాడి బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన నేప‌థ్యంలో గురువారం చెన్నైలో నిర్వ‌హించిన…

1 hour ago

ప‌వ‌న్ క‌ల్యాణ్… బ్యాక్ టు డ్యూటీ!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. ఏపీకి చేరుకున్నారు. గ‌త నెల…

1 hour ago

మగాళ్లకు పీరియడ్స్ రావాలని వెయ్యిసార్లు ప్రార్థించిన నటి

మహిళలు యుక్త వయసుకు వచ్చిన దగ్గర్నుంచి వారిని పీరియడ్స్ ఎంతగా ఇబ్బంది పెడతాయో ఆ బాధను అనుభవించే వారికి మాత్రమే…

3 hours ago