Movie News

స్టార్ వారసుడి దర్శకత్వంలో సందీప్ కిషన్

కోలీవుడ్ స్టార్ విజయ్ వారసుడు జేసన్ విజయ్ నటన కంటే దర్శకత్వం వైపే మొగ్గు చూపుతున్నాడు. ఈ విభాగంలో ఋజువు చేసుకున్నాక హీరోగా ట్రై చేస్తాడేమో చూడాలి. ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైంతో పాటు ఇంకొక్క సినిమా చేసి పూర్తి స్థాయి రాజకీయాల వైపు వెళ్లాలని నిర్ణయించుకున్న తండ్రి అభిమానులు స్క్రీన్ మీద కొరత ఫీలవ్వకూడదంటే జేసన్ ఎంట్రీ ఇవ్వాలి. కానీ ఇతను డైరెక్షన్ అంటూ రూటు మార్చడంతో ఫ్యాన్స్ ప్రస్తుతం అయోమయంలో ఉన్నారు. స్క్రిప్ట్ పనులు పూర్తి కావొస్తున్న ఈ మూవీకి లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

ఇందులో హీరోగా సందీప్ కిషన్ దాదాపు లాకైనట్టు కోలీవుడ్ టాక్. ఇటీవలే రాయన్ పెర్ఫార్మన్స్ తో అక్కడి ప్రేక్షకులకు బాగా దగ్గరైన మన తెలుగు కుర్రాడికి ఆఫర్లు బాగా వస్తున్నాయి. మానగరం నుంచి కెప్టెన్ మిల్లర్ దాకా రెగ్యులర్ గా తమిళ ఆడియన్స్ కి కనిపిస్తున్నప్పటికీ రాయన్ తెచ్చిన ఇమేజ్ వేరు. జేసన్ విజయ్ రాసుకున్న కథకు ఇతను న్యాయం చేయగలడని భావించి సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు కానీ జేసన్ మాత్రం ఫిలిం మేకింగ్ కి సంబంధించిన పలు విషయాలను సీరియస్ గా స్టడీ చేసే పనిలో ఉన్నాడు.

గోట్ రూపంలో గత కొన్నేళ్లలో ఎన్నడూ చూడని డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్న విజయ్ తమిళనాడు, ఓవర్సీస్ లో మంచి వసూళ్లు రాబట్టి కొంత ఊరట కలిగించాడు. త్వరలో డెబ్యూ చేయబోయే జేసన్ విషయాల్లో జోక్యం చేసుకోడనే టాక్ ఆల్రెడీ ఉంది. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి సీనియర్ స్టార్ హీరోలకు వారసత్వం లేని నేపథ్యంలో విజయ్ కి కొడుకు ఉన్నాడు కాబట్టి అతను హీరో అయితేనే ఆ లెగసిని అభిమానులు మోస్తారు. కేవలం దర్శకత్వమంటే అంత ఫాలోయింగ్ ఉండదు. ఒకవేళ సందీప్ కిషన్ వార్తే నిజమైన పక్షంలో బలమైన కంటెంట్ నే ఈ కలయికలో ఆశించవచ్చు.

This post was last modified on September 9, 2024 12:14 pm

Share

Recent Posts

పెంచి పోషించిన గ్రోకే దెబ్బేసిందిగా మస్క్

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…

17 minutes ago

పెళ్లి పేరుతో బిగ్ బాస్ విన్నర్ మోసం?

తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…

21 minutes ago

జైలర్ 2 ఋజువు చేయాల్సినవి ఎన్నో

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…

27 minutes ago

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

3 hours ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

4 hours ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

4 hours ago