వార్షిక పన్నుచెల్లింపులకు సంబంధించిన ఆసక్తికర రిపోర్టు ఒకటి తాజాగా విడుదలైంది. 2023- 24 సంవత్సరానికి సెలబ్రిటీల్లో అత్యధిక పన్ను చెల్లింపులు జరిపిన టాప్ 20 జాబితాను ఫార్చ్యూన్ ఇండియా మేగజైన్ తాజాగా వెల్లడించింది. ఇందులో బాలీవుడ్ బాద్ షా టాప్ స్థానంలో నిలిచారు. ఆయన తర్వాతే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నిలవటం ఆసక్తికరంగా మారింది.
దేశీయ సెలబ్రిటీల్లో షారుక్ ఖాన్ ఏకంగా రూ.92 కోట్ల పన్ను కట్టినట్లుగా పేర్కొన్నారు. షారుక్ కు చాలా దూరంగా విరాట్ కొహ్లీ పన్ను చెల్లింపులు ఉండటం విశేషం. షారుక్ తర్వాత అత్యధిక పన్ను చెల్లింపులు జరిపిన నటుడిగా తమిళ సూపర్ స్టార్ విజయ్ నిలిచారు. ఆయన రూ.80 కోట్ల పన్ను చెల్లింపులు జరిపారు. బాలీవుడ్ కు చెందిన మరో ప్రముఖ నటుడు కం కండల వీరుడు సల్మాన్ ఖాన్ రూ.75 కోట్లు చెల్లించి మూడో స్థానంలో నిలిచారు.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ నాలుగో స్థానంలో నిలిచి రూ.71 కోట్లు చెల్లించగా.. ఐదో స్థానంలో విరాట్ కొహ్లీ రూ.66కోట్లు చెల్లింపులు జరిపినట్లుగా పేర్కొన్నారు. ఆరేడు స్థానాల్లో అజయ్ దేవగణ్ రూ.42 కోట్లు.. ఎంఎస్ ధోనీ రూ.38 కోట్లు చెల్లింపులు జరిపారు.
యానిమల్ మూవీతో తిరుగులేని విజయాన్ని అందుకున్న రణ్ బీర్ కపూర్ రూ.36 కోట్ల పన్ను చెల్లింపులు జరపగా.. హ్రతిక్ రోషన్.. సచిన్ టెండూల్కర్ లు తర్వాతి స్థానాల్లో నిలిచారు.
మొత్తం టాప్ 20 జాబితాలో ఉన్న మరికొందరు ప్రముఖులు.. వారు చెల్లించిన ఆదాయపన్ను లెక్కల్ని చూస్తే..
- కపిల్ శర్మ రూ.26 కోట్లు
- సౌరభ్ గంగూలీ రూ.23 కోట్లు
- షాహిద్ కపూర్ రూ.14 కోట్లు
- మోహన్ లాల్ రూ.14 కోట్లు
- అల్లు అర్జున్ రూ.14కోట్లు
- హార్దిక్ పాండ్యా రూ.13 కోట్లు
- కియారా అడ్వాణీ రూ.12కోట్లు
- కత్రినా కైఫ్ రూ.11 కోట్లు
- పంకజ్ త్రిపాఠి రూ.11 కోట్లు
- అమిర్ ఖాన్ రూ.10 కోట్లు
- రిషబ్ పంత్ రూ.10 కోట్లు