తమిళ అభిమానులు కొన్నేళ్ల ముందు వరకు స్టార్ హీరోల కొత్త సినిమాలు రిలీజైనపుడు మామూలు హంగామా చేసేవారు కాదు. అక్కడ ఓ మోస్తరు హీరోకు కూడా తెల్లవారుజామున షోలు పడిపోయేవి. విజయ్, అజిత్ లాంటి హీరోల సినిమాలంటే అర్ధరాత్రి నుంచే హంగామా ఉండేది. బెనిఫిట్ షోలతో నానా బీభత్సం చేసేవాళ్లు ఫ్యాన్స్.
కానీ స్టాలిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్ల కిందట్నుంచి ఈ స్పెషల్ షోలు ఆపేశారు. ఉదయం తొమ్మిది నుంచే అక్కడ షోలు పడుతున్నాయి. ఇది స్టార్ హీరోల అభిమానులకు అస్సలు మింగుడు పడడం లేదు. ప్రపంచమంతా చూసేశాక తాము సినిమా చూడ్డమేంటని అసహనానికి గురవుతున్నారు. తమిళనాడు బోర్డర్లో ఉండే వేరే రాష్ట్రాల టౌన్లలో తమ కంటే ముందు షోలు పడుతుంటే అక్కడికి ప్రయాణించి మరీ స్పెషల్ షోలు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో విజయ్ కొత్త సినిమా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ రిలీజైంది.
ఈ చిత్రానికి కూడా తమిళనాట ఉదయం 9 నుంచే షోలు మొదలయ్యాయి. ఐతే ఆశ్చర్యకరంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు తెల్లవారుజామున 4 గంటలకే షోలు పడడం విశేషం. హైదరాబాద్ సిటీలో 15 థియేటర్లలో ఈ షోలు ప్లాన్ చేశారు. ఐతే విజయ్ సినిమాను తెలుగు వాళ్లు మరీ అంత త్వరగా వెళ్లి చూస్తారా అని సందేహం కలగొచ్చు. కానీ తెలుగు వెర్షన్ షోలు రెండుకే పరిమితం చేశారు. మిగతా థియేటర్లన్నీ తమిళ వెర్షనే వేశాయి 4 గంటల షోకు. దీంతో హైదరాబాద్‌లో ఉండే తమిళ జనాల ఆనందం అంతా ఇంతా కాదు. ఆ షోలన్నింటికీ దాదాపుగా ఫుల్స్ పడిపోయాయి.
తమిళనాడులోని చెన్నై సహా ఏ నగరంలోనూ లేనిది హైదరాబాద్‌లో దొరికిందని తమిళ ప్రేక్షకులు సంబరపడిపోయారు. తెలుగు వెర్షన్ షోలు కూడా ఫుల్స్‌తో నడవడం విశేషం. ఇక హైదరాబాద్‌లో చాలా థియేటర్లు ఉదయం 9 గంటలకు తెలుగు వెర్షన్ షోలు వేశాయి. తమిళ వెర్షన్‌కు కూడా నగర వ్యాప్తంగా ప్రధాన మల్టీప్లెక్సులన్నింట్లో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే షోలు ఇచ్చారు. ఐతే ఈ హంగామా బాగానే ఉన్నా.. సినిమాకు బ్యాడ్ టాక్ రావడమే నిరాశ కలిగించే విషయం.
This post was last modified on September 5, 2024 5:19 pm
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్‌ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…
శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ…
మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…