దేవర విషయంలో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మీద అంచనాల బరువు మాములుగా లేదు. నిన్న విడుదలైన మూడో పాట దాయాదీ దాయాది మీద మ్యూజిక్ లవర్స్ లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరికి వినగానే నచ్చేయగా మరికొందరు చాలా ఎక్స్ పెక్ట్ చేశామని, అనుకున్న స్థాయిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సాంగ్ లో వాడిన వాయిద్యాలు, ట్యూన్ కంపోజ్ చేసిన విధానం గతంలో వచ్చిన విజయ్ బీస్ట్ లోని అలమతి అబిబోని గుర్తు చేసిందని మరికొన్ని కామెంట్స్ వచ్చాయి. అప్పట్లో ఇది కూడా నెగటివ్ ఫీడ్ బ్యాక్ తో మొదలై చివరికి టాప్ ఛార్ట్ బస్టర్ గా నిలవడం విశేషం.
ఇప్పుడు దేవరకు అంతకు మించి అద్భుతాలు జరిగిపోవాలనేది జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల కోరిక. ఫియర్ సాంగ్ బాగా రీచ్ అయ్యింది. చుట్టమల్లే స్లో మెలోడీ అయినా క్రమంగా ఎక్కేసింది. మరి దాయాది అదే కోవలోకి చేరుతుందా లేదానేది ఇంకొన్ని రోజులు ఆగితే కానీ క్లారిటీ రాదు. ఇంకో ఆయుధ పూజ పాట ఒకటే బ్యాలన్స్ ఉంది. వీటి సంగతి కాసేపు పక్కనపెడితే అనిరుధ్ కి అసలైన సవాల్ ఇకపై రానుంది. అదే బ్యాక్ గ్రౌండ్ స్కోర్. జైలర్, లియో లాంటి సినిమాలకు ఇతని బీజీఎమ్ ఎంత ప్లస్ అయ్యిందో చూశాం. మాములు సీన్లను సైతం గొప్పగా నిలబెట్టిన ఘనత తనది.
అలాంటిది దేవర లాంటి కంటెంట్ మూవీ దొరికితే ఓ రేంజ్ లో చెలరేగిపోవాలి. అసలే సినిమా మూడు గంటల నిడివికి దగ్గర ఉండొచ్చనే టాక్ యూనిట్ నుంచి వినిపిస్తోంది. అలాంటప్పుడు అంత సేపు ఎంగేజ్ చేయాలంటే సంగీతం పాత్ర చాలా కీలకం. ఇంకో 22 రోజులు మాత్రమే ఉండటంతో రీ రికార్డింగ్ కి వీలైనంత సమయం కేటాయించడం అవసరం. ఈ పని ఎంతవరకు వచ్చిందో బయటికి తెలియనివ్వడం లేదు. దర్శకుడు కొరటాల శివ పోస్ట్ ప్రొడక్షన్ లో చాలా బిజీగా ఉన్నారు. ఇంకోవైపు తక్కువ టైంలో ప్రమోషన్ల వేగం పెంచాలి. ఇకపై దేవర బృందం కాళ్లకు చక్రాలు కట్టుకుని పరిగెత్తాల్సిందే.
This post was last modified on September 5, 2024 9:36 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…