టాలీవుడ్లో గత రెండేళ్లలో ఎన్నో రీ రిలీజ్‌లు చూశాం. టాప్ స్టార్ల అభిమానులు తమ ఆరాధ్య కథానాయకుల కెరీర్లలో కల్ట్, బ్లాక్ బస్టర్ సినిమాలను మళ్లీ ఓసారి దర్శించుకుని థియేటర్లలో ఎంతో సందడి చేశారు. సరికొత్త అనుభూతిని పొందారు. ఐతే పవన్ సినిమాలు రీ రిలీజైనపుడు థియేటర్లలో అభిమానుల హంగామా అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ముఖ్యంగా హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ అడ్డా అయిన సంధ్య థియేటర్లో ఏదైనా సినిమా రీ రిలీజైతే.. థియేటర్లో కనిపించే వాతావరణం చూసి షాకవ్వని వాళ్లుండరు.
‘జల్సా’ సినిమాకు అక్కడ జరిగిన హంగామా అంతా ఇంతా కాదు. పాటలు వచ్చినపుడల్లా థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరూ లేచి నిలబడి కోరస్ పాడుతూ చేసిన హడావుడి చూసి ఔరా అనుకున్నారు. ఇదేం మేనియారా బాబూ అని ఆశ్చర్యపోయారు. ఐతే ఇప్పుడు ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ సందర్భంగా ఆ థియేటర్లో దృశ్యాలు చూసిన వాళ్లకు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి.
సంధ్య థియేటర్ కెపాసిటీ వెయ్యికి పైనే. హైదరాబాద్‌లోని సింగిల్ స్క్రీన్లలో అతి పెద్ద వాటిలో అదొకటి. అలాంటిది ఉన్న కెపాసిటీకి మూడు రెట్లు.. అంటే మూడు వేలమందికి పైగా థియేటర్లోకి వచ్చేశారు సోమవారం రాత్రి సెకండ్ షోకు. టికెట్ లేకుండా ఎలా అనుమతించారు, దీని వల్ల జరిగే అనర్థాలు ఏంటి అన్నది ఆలోచించలేదా అంటే సమాధానం లేదు. కానీ ట్రిపుల్ కెపాసిటీతో థియేటర్ నిండిపోవడంతో ఎవ్వరూ సీట్లో కూర్చుని సినిమా చూసే పరిస్థితి లేదు. థియేటర్లో నిలబడ్డానికి కూడా చోటు లేని పరిస్థితి తలెత్తింది.
ఇక షో మొదలయ్యాక జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. సంచుల్లో తెచ్చుకున్న పేపర్లను విసురుతూ.. ప్రతి డైలాగ్, ప్రతి సీన్, ప్రతి ఫైట్, ప్రతి పాటకు అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా పాటలు వచ్చినపుడు కోరస్‌లు పాడుతూ అభిమానులు చేసిన రచ్చకు థియేటర్ హోరెత్తిపోయింది. ఈ దృశ్యాలు నిన్న రాత్రి నుంచి వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి ఇదేం క్రేజ్, ఇదేం మ్యాడ్‌నెస్ అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
This post was last modified on September 3, 2024 3:44 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…