నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా.. దసరా. ఆ చిత్రానికి ఏకంగా రూ.100 కోట్ల మేర గ్రాస్ వచ్చింది. ఐతే ఓవరాల్‌గా ఆ సినిమా హిట్టే కానీ.. ఏపీలో మాత్రం అనుకున్నంతగా ఆడలేదు. తెలంగాణ యాస, కల్చర్ బాగా దట్టించడం వల్లో ఏమో.. ఈ సినిమా నైజాంలో మాదిరి ఏపీలో ఆడలేదు. కొన్ని ఏరియాల్లో నష్టాలు తప్పలేదు. ఓవరాల్‌గా అక్కడ ఆ సినిమా యావరేజ్ మూవీగా నిలిచింది. కానీ నైజాంలో మాత్రం ‘దసరా’ బ్లాక్ బస్టర్ ఫలితాన్నందుకుంది.
నాని తర్వాతి చిత్రం ‘హాయ్ నాన్న’ మాత్రం అన్ని చోట్లా ఒకే రకంగా ఆడింది. కానీ ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ పరిస్థితి చూస్తే.. దసరా పరిస్థితి రిపీటయ్యేలా ఉంది. అలా అని ఇందులో కల్చర్, యాస్ లాంటి అంశాలు ప్రభావితం చేసేలా లేవు.
‘సరిపోదా శనివారం’ మంచి టైమింగ్‌లోనే రిలీజయ్యింది. టాక్, రివ్యూలు కూడా డీసెంట్‌గానే వచ్చాయి. ప్రేక్షకులు ఓ మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న టైంలో నాని సరిపడా వినోదాన్నే అందించాడు. కానీ వర్షాలు ఈ చిత్రాన్ని పెద్ద దెబ్బ కొట్టాయి. నైజాంకు కేంద్ర స్థానం అయిన హైదరాబాద్‌లో వర్షం పడ్డా మరీ ఇబ్బందికరంగా ఏమీ లేదు పరిస్థితి. దీంతో నైజాం కలెక్షన్లు బాగానే ఉన్నాయి. ఇప్పటికే రూ.8 కోట్లకు పైగా షేర్‌తో బ్రేక్ ఈవెన్ మార్కుకు చేరువ అయిపోయింది ‘సరిపోదా శనివారం’. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి ఆశాజనకంగా లేదు.
వర్షం వల్ల విజయవాడ, గుంటూరు సహా పలు ప్రాంతాలు సమస్యల్లో చిక్కుకోవడం ‘సరిపోదా శనివారం’ వసూళ్ల మీద తీవ్ర ప్రభావం చూపింది. అక్కడ బ్రేక్ ఈవెన్ మార్కులో సగం కంటే కాస్త ఎక్కువగా వసూళ్లు వచ్చాయంతే. ఇంకో 40-45 శాతం రికవరీ అవ్వాల్సి ఉంది. ఫుల్ రన్లో అది జరుగుతుందా అన్నది సందేహంగానే ఉంది. దీంతో ‘దసరా’ ఫలితమే మరోసారి రిపీటయ్యేలా ఉంది.
This post was last modified on September 3, 2024 3:40 pm
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ…
తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా లోన్ యాప్ల వేధింపుల కారణంగా పలు ఆత్మహత్యలు వెలుగు చూస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం…
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట.. ఈ క్రమంలో రేవతి అనే…
ఏపీ సీఎం చంద్రబాబు సహా కూటమి సర్కారు అమరావతిని పరుగులు పెట్టించేందుకు రెడీ అయింది. ఎక్కువగా కాన్సన్ట్రేషన్ రాజధానిపైనే చేస్తున్నారు.…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…
ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…