ఏజెంట్ వచ్చి ఏడాది నాలుగు నెలలు గడిచిపోతున్నా అఖిల్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. యువి క్రియేషన్స్ అనిల్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ధీర అనే ఫాంటసీ మూవీని ప్లాన్ చేసుకున్నారు కానీ ఇప్పటిదాకా సెట్స్ పైకి వెళ్ళకపోవడం పలు అనుమానాలు లేవనెత్తింది. క్యాన్సిల్ కాకపోయినా బడ్జెట్ పరంగా ఉన్న కొన్ని ఇబ్బందులతో పాటు స్క్రిప్ట్ ని పక్కాగా తీర్చిదిద్దడంలో బాగా జాప్యం జరుగుతోందని ఇన్ సైడ్ టాక్. అయితే ముందు దీన్నే ప్రారంభించాలని అనుకున్నప్పటికీ అఖిల్ నిర్ణయాల్లో పలు కీలక మార్పులు జరుగుతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. అదేంటో చూద్దాం.
వినరో భాగ్యము విష్ణుకథతో మెప్పించిన దర్శకుడు మురళీకృష్ణ అబ్బూరు అన్నపూర్ణ టీమ్ కు ఒక కథ చెప్పి మెప్పించాడు. నాగార్జున, అమల, సుప్రియలకు బాగా నచ్చిందని గతంలోనే వార్త వచ్చింది. లెనిన్ టైటిల్ ని పరిశిలనలో పెట్టారు. ఇప్పుడీ లెనిన్ నే ముందు పూర్తి చేసి ఆ తర్వాత ధీర తాలూకు వ్యవహారం చూద్దామని ప్రాథమికంగా డిసైడయ్యారని తెలిసింది. అయితే అఖిల్ ధీర గెటప్ కోసం జుత్తు, గెడ్డం బాగా పెంచేశాడు. ఒకవేళ ఇక్కడ చెప్పిన వార్త నిజమే అయినా పక్షంలో ఇదే హెయిర్ స్టైల్ ని లెనిన్ కోసం వాడుకుంటారా అనేది సస్పెన్స్ గా మారింది. ఏదీ ఇప్పట్లో తేలేలా లేదు.
ఏది ఏమైనా వీలైనంత త్వరగా అఖిల్ శుభవార్త చెప్పాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. ఒకపక్క నాగార్జున నచ్చితే చాలు స్పెషల్ రోల్స్ కి ఎస్ చెప్పేస్తున్నారు. కుబేర, కూలీ రెండూ అదే కోవలోకి వస్తాయి. బిగ్ బాస్ 8 మొదలవ్వడంతో దాని షూటింగ్ ఇప్పుడున్న బిజీ డైరీకి తోడయ్యింది. ఆయన ప్రాధాన్యతలు మారిపోతున్నాయి. నాగచైతన్య తండేల్ తప్ప వేరే ప్రపంచం గురించి పట్టించుకోవడం లేదు. దీని రిలీజ్ డేట్ ఇంకా ఫిక్సవ్వాల్సి ఉంది. సో అఖిల్ కనక స్పీడ్ పెంచితే రాబోయే రోజుల్లో సోలో హీరోలుగా అన్నదమ్ముల సినిమాలు ఎంజాయ్ చేస్తామని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చూడాలి మరి.
This post was last modified on September 3, 2024 3:10 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…