అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా గబ్బర్ సింగ్ అరాచకం చేశాడు. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్లాన్ చేసిన ఈ రీ రిలీజ్ గతంలో రెండు మూడుసార్లు జరిగిన నేపథ్యంలో వసూళ్లు మరీ భారీగా ఉండకపోవచ్చేమోననే అనుమానాలు తలెత్తాయి.
వాటిని పటాపంచలు చేస్తూ పవర్ స్టార్ ఫ్యాన్స్ థియేటర్ల మీదకు సునామిలా విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లాంటి మెట్రో సిటీతో మొదలుపెట్టి మచిలీపట్నం లాంటి పట్టణం దాకా ఎక్కడ చూసినా ఒకటే హోరు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సైతం వర్షాలను లెక్క చేయకుండా అభిమానులు గబ్బర్ సింగ్ ని సెలెబ్రేట్ చేసుకోవడానికి పోటెత్తారు.
ట్రేడ్ టాక్ ప్రకారం గబ్బర్ సింగ్ ముందు రోజు ప్రీమియర్లతో కలిపి ఓపెనింగ్ డే సుమారు 6 కోట్లకు పైగానే గ్రాస్ వసూలు చేసింది. ఇది ఇప్పటిదాకా రీ రిలీజ్ కాబడిన సినిమాల్లో అత్యధిక నెంబర్. ఏపీ తెలంగాణ కలిపి 1400 షోలకు పైగా ప్రదర్శిస్తే తెలుగు రాష్ట్రాల నుంచే 5 కోట్ల గ్రాస్ దాటేసింది.
ప్రసాద్ మల్టీప్లెక్స్, సంధ్య కాంప్లెక్స్ లాంటి పేరు పొందిన థియేటర్ సముదాయాలలో పది లక్షలకు పైగా వసూలైనట్టు తెలిసింది. ఇండియా మొత్తం మీద పద్దెనిమిది వందలకు పైగా షోలు వేస్తే కర్ణాటకలో హౌస్ ఫుల్స్ నమోదు కాగా పరిమిత ఆటలతో తమిళనాడులోనూ దుమ్ము దులిపింది.
మొత్తంగా చూస్తే ఇప్పట్లో గబ్బర్ సింగ్ ని టచ్ చేయడం అసాధ్యం అనేలా ఊచకోత జరిగింది. మురారిని దాటాలనుకున్న లక్ష్యం సులభంగా నెరవేరుతోంది. ఈ రోజు నుంచి దాదాపు అన్ని చోట్ల గబ్బర్ సింగ్ ని కొనసాగిస్తున్నారు. ఇదే దూకుడు ఉండకపోవచ్చు కానీ డీసెంట్ ఆక్యుపెన్సీలైతే ఖచ్చితంగా ఉంటాయి.
వీకెండ్ దాకా అనుమానమే. సెప్టెంబర్ 5 నుంచి వరసగా కొత్త సినిమాలు క్యూ కట్టాయి కనక గబ్బర్ సింగ్ ఏ మేరకు నెట్టుకొస్తాడో చూడాలి. థియేటర్ల దగ్గర హంగామా తాలూకు ఫోటోలు, వీడియోలతో ట్విట్టర్, ఇన్స్ టా తదితర సామజిక మాధ్యమాలు హోరెత్తిపోతున్నాయి.
This post was last modified on September 3, 2024 10:15 am
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…