సరిపోదా శనివారం విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న న్యాచురల్ స్టార్ నాని ఇవాళ జరిగిన సక్సెస్ మీట్ లో మీరు టైర్ వన్ హీరో అయ్యారనే కామెంట్ కి స్పందిస్తూ అసలు ఆ గోల నాకొద్దంటూ ఓపెన్ స్టేట్ మెంట్ ఇవ్వడం ఆసక్తి రేపింది. నిజానికి ఈ విషయంలో సోషల్ తో పాటు రెగ్యులర్ మీడియాలోనూ రిలీజ్ కు ముందు వరకు సినిమా బ్లాక్ బస్టర్ అయితే నాని టైర్ 1 బ్యాచులోకి వచ్చేస్తాడనే యనాలసిస్ లు విపరీతంగా జరిగాయి. బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ చూస్తుంటే అలాగే ఉంది. దసరా, హాయ్ నాన్న తర్వాత హ్యాట్రిక్ హిట్లతో దూసుకుపోతున్న నాని ఇప్పుడు మంచి ఊపుమీదున్నాడు.
నాని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాని టాప్ లీగ్ కు దగ్గరవుతున్న మాట వాస్తవం. దర్శకుడు వివేక్ ఆత్రేయ అన్నట్టు ప్రతి సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ పెంచుకుంటూ పోతున్న న్యాచురల్ స్టార్ కి బడ్జెట్ లు కూడా అంతకంతా పెరుగుతున్నాయి. దసరా ముందు వరకు వంద కోట్ల గ్రాస్ నాని ఖాతాలో లేదు. ఇప్పుడు లెక్కలు మారాయి. శ్రీకాంత్ ఓదెలతో చేయబోయే మూవీకి దానికన్నా ఎక్కువే ఖర్చు పెట్టబోతున్నారు. బిజినెస్ యాంగిల్, బ్రేక్ ఈవెన్, లాభాలు ఇలా ఏ కోణంలో చూసుకున్నా గత కొన్నేళ్లలో నాని సినిమా వల్ల విపరీతంగా నష్టపోయిన దాఖలాలు లేవు.
అంటే సుందరానికి సైతం మంచి రెవిన్యూ తీసుకొచ్చింది. వి, టక్ జగదీష్ లు ఓటిటికి వెళ్లడం ద్వారా నిర్మాతలకు సేఫ్ వెంచర్లయ్యాయి. సో లాసనే ప్రసక్తే లేకుండా నాని ప్లానింగ్ మంచి ఫలితాలు ఇస్తోంది. అందుకే టైర్ 1, టైర్ 2 అంటూ నన్ను ఉచ్చులోకి లాగొద్దని కోరుకుంటున్నాడు. వీకెండ్ భారీ వసూళ్లు నమోదు చేసే పనిలో ఉన్న సరిపోదా శనివారంకు తెలుగు రాష్టాల్లో భారీ వర్షాలు స్పీడ్ బ్రేకర్లుగా మారాయి. వీటి ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది సోమవారానికి ఒక క్లారిటీ వస్తుంది. నాని అన్నట్టు అంటే సుందరానికి హిట్టవ్వలేదన్న బెంగ సరిపోదా శనివారం పూర్తిగా తీర్చేసింది.
This post was last modified on August 31, 2024 5:22 pm
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట.. ఈ క్రమంలో రేవతి అనే…
ఏపీ సీఎం చంద్రబాబు సహా కూటమి సర్కారు అమరావతిని పరుగులు పెట్టించేందుకు రెడీ అయింది. ఎక్కువగా కాన్సన్ట్రేషన్ రాజధానిపైనే చేస్తున్నారు.…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…
ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…