Movie News

పెళ్లి ఎక్కడో చెప్పిన అదితి రావు

త్వరలో మరో సినీ జంట పెళ్లి పీటలు ఎక్కుతోంది. కొన్నేళ్ల కిందట ప్రేమలో పడి.. కొన్ని నెలల కిందటే సైలెంటుగా నిశ్చితార్థం చేసుకున్న సిద్ధార్థ్, అదితి రావు హైదరి పెళ్లికి రెడీ అయిపోయారు. తమ పెళ్లి ఎప్పుడో చెప్పలేదు కానీ.. ఎక్కడ అన్నది స్వయంగా అదితి వెల్లడించడం విశేషం. తమ పూర్వీకులకు ఎంతో ప్రత్యేకమైన వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో తమ పెళ్లి జరగబోతున్నట్లు అదితి చెప్పింది. తమ నిశ్చితార్థం కూడా ఇక్కడే జరిగిన విషయాన్ని ఆమె ధ్రువీకరించింది.

తమ పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేదని.. తాను, సిద్దార్థ్ కలిసి ఓ నిర్ణయానికి వచ్చాక కలిసి అనౌన్స్ చేస్తామని అదితిరావు ప్రకటించింది. తమ పరిచయం, ప్రేమ గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో అదితి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

“మహాసముద్రం షూటింగ్ సమయంలో నాకు, సిద్ధార్థ్‌కు పరిచయం అయ్యింది. కొంత కాలానికి స్నేహితులయ్యాం. తర్వాత ప్రేమలో పడ్డాం. మా నానమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అన్ని విషయాలూ తనతో షేర్ చేసుకునేదాన్ని. హైదరాబాద్‌లో ఆమె ఒక స్కూల్ కూడా ప్రారంభించారు. నా చిన్ననాటి రోజులు ఎక్కువగా అక్కడే గడిపా. కొన్నేళ్ల కిందట ఆమె కన్నుమూశారు. ఆ విషయం సిద్ధుకు తెలుసు. నా దగ్గరికి వచ్చి ఆ స్కూల్‌కు తీసుకెళ్లమని అడిగాడు. మార్చిలో మేమిద్దరం అక్కడికి వెళ్లాం. ఆ స్కూల్లోనే సిద్ధార్థ్ నాకు మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేశాడు. మా నానమ్మకు ఎంతో ఇష్టమైన ప్రదేశంలో ఆమె ఆశీస్సుల కోసమే అలా చేశాడు. తను ప్రేమను వ్యక్తం చేసిన తీరు నాకెంతో నచ్చింది” అని అదితి చెప్పింది. సిద్ధార్థ్, అదితి ఇద్దరికి ఇంతకుముందే వేరే పెళ్లి అయ్యింది. విడాకులు తీసుకున్నారు. ఈ ఇద్దరు ఒక్కటయ్యారు.

This post was last modified on August 30, 2024 8:59 pm

Share

Recent Posts

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

56 minutes ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

1 hour ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

2 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

2 hours ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

2 hours ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

3 hours ago