గేమ్ ఛేంజర్ డిసెంబర్ రిలీజని అందరికీ తెలుసు కానీ డేట్ మాత్రం ఇప్పటిదాకా అఫీషియలవ్వలేదు. డిసెంబర్ 20 కేవలం లీకైన సోర్స్ ద్వారా మీడియా దగ్గరున్న సమాచారం తప్ప నిజంగా అదేనా కాదానేది ఎవరికీ తెలియలేదు. నిన్న విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2 ఈ తేదీని లాక్ చేసుకుంటూ అధికారిక ప్రకటన ఇచ్చింది. చెప్పాలంటే రామ్ చరణ్ కు తమిళనాడులో వెట్రిమారన్ నుంచి పెద్ద సవాల్ ఎదురు కానుంది. అసలే భారతీయుడి 2 పుణ్యమాని శంకర్ బ్రాండ్ కి కోలీవుడ్ లో సొట్టలు పడ్డాయి. అది గేమ్ ఛేంజర్ తో రిపేర్ అవుతుందనుకుంటున్న టైంలో ఇప్పుడీ ట్విస్టు వచ్చి పడింది.
ఇంకొకరు పోటీకి రాకముందే ఎస్విసి బృందం ఒక క్లారిటీ ఇవ్వడం బెటర్. లేదంటే మేము ముందే చెప్పాం అనే ఇతర ప్రొడ్యూసర్ల వాదనకు కౌంటర్ వేయడానికి ఉండదు. అసలే ముఫాసా ది లయన్ కింగ్ తో ఓవర్సీస్ లో థియేటర్ల ఇబ్బంది వస్తుందని ఫ్యాన్స్ ఖంగారు పడుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణ్ ధావన్ బేబీ జాన్ నుంచి కాంపిటీషన్ ఎదురవుతోంది. రెండు వారాల ముందు వచ్చే పుష్ప 2 ది రూల్ కనక బ్లాక్ బస్టర్ అయితే దాన్ని కనీసం నెల రోజుల నడిపించేందుకు ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపిస్తారు. దిల్ రాజు థియేటర్ చైన్, నెట్వర్క్ పెద్దదే అయినా అది ఏపీ తెలంగాణ దాటి కాదుగా.
ఇవన్నీ ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన విషయాలు. వినాయక చవితికి ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలని దిల్ రాజు భావిస్తుండగా శంకర్ పచ్చ జెండా ఊపితే తప్ప అది సాధ్యం కాదు. ఇంకో మూడున్నర నెలలు మాత్రమే ఉంది. మూడు వందల కోట్ల ప్యాన్ ఇండియా సినిమా ప్రమోషన్లకు ఇది తక్కువ సమయం. ఇంకా ప్యాచ్ వర్క్ షూటింగ్ జరుగుతూనే ఉంది. శ్రీకాంత్, ఎస్జె సూర్యలతో బ్యాలన్స్ తీస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ ఒకవైపు జరిపిస్తున్నారు కానీ పనులు ఇంకొంచెం వేగవంతం చేయాలి. చాలా గొప్పగా చెబుతున్న తమన్ సంగీతాన్ని సైతం త్వరగా బయటికి తీసుకొచ్చి హైప్ పెంచే దిశగా చర్యలు తీసుకోవాలి.
This post was last modified on August 30, 2024 9:00 pm
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…