అదేంటి అంతా అయిపోయింది, థియేటర్లో ఆడలేదు, ఓటిటిలో ట్రోలింగ్ బారిన పడింది ఇంకేముంది అనుకుంటున్నారా. కొన్ని పీడకలలు అంతే. అంత త్వరగా వీడిపోవు. ప్రేక్షకుల సహనంతో ఆడుకుని కమల్ హాసన్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచిన ఇండియన్ 2 బృందానికి మల్టీప్లెక్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా లీగల్ నోటీసులు పంపించిందని ముంబై టాక్. చాలా కాలంగా తాము పాటిస్తున్న నిబంధనను అతిక్రమించి ఓటిటికి ఇవ్వడం వల్ల సంజాయిషీ కోరుతూ లైకా సంస్థకు నోటీసు పంపిందట. సినిమా అనే ఆస్తి ప్రొడ్యూసర్ ఇష్టం కదా అనే డౌట్ మీకు రావొచ్చు.
ఇక్కడే ఉంది మెలిక. బాలీవుడ్ సినిమాలు ఏవైనా సరే బడ్జెట్ తో సంబంధం లేకుండా ఖచ్చితంగా 8 వారాల థియేటర్ ఓటిటి గ్యాప్ పాటించాలనేది మల్టీప్లెక్సులు అక్కడి నిర్మాతలతో చేసుకున్న ఒప్పందం. ఒకవేళ ఎవరైనా పాటించకూడదని అనుకుంటే వాళ్లకు స్క్రీన్లు కేటాయించబడవు. పివిఆర్, ఐనాక్స్, సినీపోలీస్, మిరాజ్ తదితర కంపెనీలన్నీ ఇందులో భాగస్వామ్యులుగా ఉన్నాయి. ఇండియన్ 2 కండీషన్ ని అతిక్రమించి హిందీ వెర్షన్ ని నెట్ ఫ్లిక్స్ లో రెండు నెలలు పూర్తి కాకుండానే రిలీజ్ చేయడం పట్ల సదరు సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన ప్రకటించింది.
ఇప్పుడు చూస్తూ ఊరుకుంటే భవిష్యత్తులో మరికొందరు నిర్మాతలు ఇదే ఫాలో అవుతారని మల్టీప్లెక్స్ యాజమాన్యాల వెర్షన్. ఇది కేవలం ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రమే అమలులో ఉంది. ఏపీ తెలంగాణలో పాటించడం లేదు. నార్త్ లో మాత్రం స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు. అందుకే ముంజ్యా లాంటి చిన్న సినిమా సైతం ఎనిమిది వారాల తర్వాతే శాటిలైట్ ఛానల్ ఆ తర్వాత ఓటిటిలో వచ్చింది. తెలుగు తమిళంలోనూ ఇలాంటి సంస్కరణలు తీసుకురావడం మంచిదేమో. మల్టీప్లెక్సులు అంత సాహసం చేయలేవు కానీ ప్రొడ్యూసర్లు స్వచ్చందంగా పాటిస్తే మాత్రం థియేటర్ రెవిన్యూ మరింత పెరుగుతుంది.
This post was last modified on August 29, 2024 10:42 pm
సౌతాఫ్రికా సిరీస్‌లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…
రీఎంట్రీ తర్వాత వరుసగా మూడు రీమేక్‌లతో పలకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలో రెండు…
మన శంకరవరప్రసాద్ గారు నుంచి మరో పాట వచ్చేసింది. నిజానికీ రిలీజ్ రేపు జరగాలి. కానీ ఒక రోజు ముందుగా…