వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10 విడుదల కాబోతున్న విశ్వంభర థియేట్రికల్ బిజినెస్ ని యువి క్రియేషన్స్ మొదలుపెట్టినట్టు సమాచారం. రేట్ల విషయం ఇంకా కొలిక్కి రానప్పటికీ నైజాం మైత్రికిచ్చి, సీడెడ్ తో సహా ఆంధ్ర అన్ని ప్రాంతాలకు ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్మెంట్స్ తో ఒప్పందం కుదుర్చుకునే ప్రతిపాదన దాదాపు ఓకే అయినట్టు సమాచారం. ఏపీ తెలంగాణ కలిపి సుమారు 120 కోట్ల దాకా ధరని కోట్ చేస్తున్నట్టు తెలిసింది. ఫైనల్ కాలేదు కానీ బేరసారాలకు సంబంధించిన చర్చలైతే జరుగుతున్నాయట. ఎక్కువ తక్కువ ఎంతైనా మినిమమ్ వంద కోట్లతో స్టార్టవుతుంది.
చిరంజీవి గత చిత్రం భోళా శంకర్ డిజాస్టర్ అయినప్పటికీ దాని ప్రభావం మార్కెట్ మీద మరీ తీవ్రంగా పడలేదు. ఆ సినిమా విషయంలో చిరు కంటే మెహర్ రమేష్ వైపే వేళ్ళన్నీ ఎత్తి చూపాయి. విశ్వంభర ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన విజువల్ థ్రిల్లర్ కావడంతో డిమాండ్ ఎక్కువగా ఉంది. పైగా ఇన్ సైడ్ రిపోర్ట్స్, దర్శకుడు వసిష్ఠ పనితనం గురించి యూనిట్ చెబుతున్న మాటలు అంతకంతా అంచనాలు పెంచుతున్నాయి. దీని కోసమే చిరు వేరే కొత్త కమిట్ మెంట్స్ ఇవ్వకుండా విశ్వంభరకే పూర్తి సమయం కేటాయిస్తున్నారు. వచ్చే నెలలో గుమ్మడికాయ కొట్టొచ్చు. టీజర్ కూడా అదే నెలలోనే.
రేటు వరకు ఎలా ఉన్నా విశ్వంభరకు పోటీ పరంగా చాలా సవాళ్లున్నాయి. బాలకృష్ణ 109 కాంపిటీషన్ కు సై అంటోంది. దిల్ రాజు తన వెంకటేష్ – అనిల్ రావిపూడి మూవీని పండక్కి లాక్ చేశారు. మైత్రి నిర్మిస్తున్న గుడ్ బ్యాక్ అగ్లీ నుంచి అజిత్ రేంజ్ పెంచేలా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. రవితేజ భాను భోగవరపు కాంబో మూవీ దాదాపు తప్పుకున్నట్టే. ఇటీవలే గాయం కారణంగా మాస్ మహారాజా రెండు నెలల పాటు రెస్ట్ తీసుకోబోతున్నాడు. ఇలాంటి వ్యూహం మధ్య విశ్వంభర భారీ వసూళ్లు రాబట్టాలంటే ఎక్స్ ట్రాడినరి అనే మాట రాబట్టుకోవాలి. సంక్రాంతికి రాబోయే వాటిలో ఎక్కువ బడ్జెట్ అయిన సినిమా విశ్వంభరనే.
This post was last modified on August 27, 2024 7:59 pm
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…