ఇటీవలే కల్కి 2898 ఏడితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకునే డెబ్యూతోనే అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకుంది. రెండో భాగంలోనూ ఉంటుంది కాబాట్టి మరో ఇండస్ట్రీ హిట్ ని ముందే ఫిక్స్ కావొచ్చు. అయితే ఇప్పటిదాకా ఏ హీరోయిన్ కి సాధ్యం కాని, అయ్యే అవకాశం లేని ఒక అరుదైన ఘనత ఈమె స్వంతం కాబోతోంది.
2007లో బాలీవుడ్ కు వచ్చిన దీపికా తన పద్దెనిమిది సంవత్సరాల కెరీర్ లో ఎన్నో విజయాలు చూసింది. ఫ్లాపులూ పలకరించాయి. ఇంత సుదీర్ఘమైన ప్రయాణంలో పెళ్లి చేసుకున్నాక కూడా ఇప్పటికీ టాప్ డిమాండ్ లో ఉండటం అంటే మాములు విషయం కాదు.
ఇక అసలు పాయింట్ కొద్దాం. దీపికా పదుకునే ఫిల్మోగ్రఫీలో హిట్ అయిన సినిమాలన్నీ పరిగణనలోకి తీసుకుని వాటి మొత్తం గ్రాస్ లెక్కేస్తే 10 వేల కోట్లకు దగ్గరగా ఉంది. బాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం కల్కి 1055 కోట్లు), జవాన్ (1143 కోట్లు), పఠాన్ (1060 కోట్లు), చెన్నై ఎక్స్ ప్రెస్ (422 కోట్లు), ఏ జవానీ హై దివాని (318 కోట్లు), బాజీరావు మస్తానీ (367 కోట్లు) వీటిలో ప్రధానమైనవి.
ఇవి కాకుండా వంద కోట్లు దాటినవి చాలా ఉన్నాయి. హాలీవుడ్ మూవీ ట్రిపుల్ ఎక్స్ రిటర్న్ అఫ్ జాండర్ కేజ్ 2300 కోట్లు కూడా ఇదే లిస్టులో తోడవుతుంది. ఇవన్నీ కలుపుకుంటే ఇప్పటిదాకా 9808 కోట్లయ్యాయి. సింగం అగైన్ వచ్చాక పది వేలు దాటేస్తుంది.
నిజంగానే ఇంత అరుదైన మైలురాయి ఎవరికీ లేకపోవడం గమనించాల్సిన అంశం. ఇంకా చేయబోయే సినిమాలు చాలానే ఉన్నాయి. ఇంకో ఐదారేళ్ళు హీరోయిన్ గా ఎలాగూ కంటిన్యూ అవుతుంది కాబట్టి మరికొన్ని ప్యాన్ ఇండియా మూవీస్ తోడవుతాయి. ఈ లెక్కన 15 వేల కోట్లు అందుకోవడం కష్టం కాదు. కల్కి పార్ట్ 2 షూటింగ్ ఎప్పుడో ఇంకా ఖరారు కాలేదు కాబట్టి దానికి సంబంధించిన డేట్లు ఇంకా ఇవ్వలేదు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న దీపికా పదుకునే విశ్రాంతిలో ఉంది. డెలివరీ అయ్యాక బ్రేక్ తీసుకుని ఆ తర్వాత షూటింగులకు వెళ్లేలా ప్లాన్ చేసుకుంటోంది. సింగం తప్ప వేరే కమిట్మెంట్లు లేవు.
This post was last modified on August 26, 2024 1:35 am
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…