Movie News

పీపుల్ మీడియా.. ఎలా తట్టుకుంటోందో?

ఎంత పెద్ద ఫినాన్షియల్ బ్యాకప్‌తో వచ్చినా సరే.. సినీ రంగంలో వరుసగా ఫ్లాపులు ఎదురైతే తట్టుకోవడం కష్టమే. ఇలా దెబ్బల మీద దెబ్బలు తగిలి సినిమాల నిర్మాణమే ఆపేసిన సంస్థలు చాలానే ఉన్నాయి. కానీ ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ బేనర్లలో ఒకటైన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మాత్రం వరుస ఫ్లాపులను తట్టుకుని గట్టిగానే నిలబడుతోంది.

కార్పొరేట్ నేపథ్యం నుంచి వచ్చిన ఈ సంస్థ.. మొదట్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలే ప్రొడ్యూస్ చేసింది. వేరే సంస్థల భాగస్వామ్యంలో సినిమాలు చేసింది. ఈ క్రమంలో గూఢచారి, ఓ బేబీ, కార్తికేయ-2 లాంటి మంచి విజయాలు అందుకుంది. ఆ తర్వాత సొంతంగా పెద్ద స్థాయిలో సినిమాలు ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టింది.

ఈ సంస్థ నుంచి ఒకే సమయంలో ఏకంగా పాతిక చిత్రాలు వివిధ దశల్లో ఉన్నాయంటే దాని దూకుడు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వాటిలో చాలా వరకు క్రేజీ కాంబినేషన్లలో తెరకెక్కుతున్న పెద్ద సినిమాలే.

ఐతే సినీ రంగంలో ఎన్ని చిత్రాలు తీస్తున్నామన్నది ముఖ్యం కాదు. వాటిలో ఎన్ని విజయవంతం అయ్యాయన్నదే కీలకం. ఈ విషయంలో పీపుల్ మీడియా ఈ మధ్య బాగా వెనుకబడిపోతోంది. ధమాకా తర్వాత ఆ సంస్థకు సరైన విజయమే లేదు. గోపీచంద్‌తో చేసిన ‘రామబాణం’ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది.

ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తీసిన క్రేజీ మూవీ ‘బ్రో’ నిరాశ పరిచింది. ఈ ఏడాది ఈగల్, మనమే, మిస్టర్ బచ్చన్.. ఇలా ఒక్కో సినిమా బోల్తా కొడుతోంది. నష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రవితేజతో ‘ఈగల్’ సినిమా ద్వారా తెచ్చుకున్న లాభాన్ని మించి.. ఆయనతో చేసిన ఈగల్, మిస్టర్ బచ్చన్ చిత్రాలతో నష్టాలు వచ్చాయి.

గత రెండేళ్లలో వచ్చిన ఫ్లాప్ సినిమాలతో ఓ వంద కోట్లయినా నష్టం వాటిల్లి ఉంటుంది పీపుల్ మీడియా సంస్థకు. కాబట్టి ఎక్కువ సినిమాలు తీయడం కాదు, కంటెంట్ ఉన్న సినిమాలు చేయడమే ప్రధానం అని గుర్తించి.. పీపుల్ మీడియా జాగ్రత్తగా అడుగులు వేస్తే మంచిది.

This post was last modified on August 23, 2024 8:03 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెగిటివిటీ ప్రభావానికి సినీ బాధితులు ఎందరో

సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…

3 hours ago

విశాల్ ప్రభావం – 30 సినిమాల బూజు దులపాలి

పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…

4 hours ago

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…

5 hours ago

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

6 hours ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

6 hours ago

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

6 hours ago