నిన్న జరిగిన మారుతీనగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చాడు. పుష్ప దర్శకుడు సుకుమార్ సతీమణి తబిత నిర్మాణ భాగస్వామ్యంలో ఇది రూపొందటం, మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం లాంటి కారణాల వల్ల విచ్చేయడంలో ఆశ్చర్యం లేదు.
కానీ తన స్పీచ్ లో కొన్ని మాటలు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు, ట్రోలింగ్ కి దారి తీశాయి. సాధారణంగా హీరోని చూసి ఫ్యాన్స్ అవుతారని, కానీ తాను మాత్రం ఫ్యాన్స్ ని చూసి హీరో అయ్యానని చెప్పాడు. ఇక్కడే బన్నీ దొరికిపోయాడు. మీమర్స్ లాజిక్స్ తో ఆడుకుంటున్నారు.
ఎంత పెద్ద హీరో అయినా తెరకు పరిచయమయ్యాక హిట్లు పడ్డాక, యాక్టింగ్ టాలెంట్ చూశాక ఫ్యాన్స్ పుట్టుకొస్తారు. ఎంట్రీ జరగక ముందే ఫ్యానిజం అంటే దశాబ్దాల తరబడి బ్యాక్ గ్రౌండ్ ఉన్న పెద్ద స్టార్ హీరో ఫ్యామిలీ అయ్యుండాలి. కానీ అల్లు అర్జున్ వచ్చిన టైంలో మద్దతుగా ఉన్నది మెగాభిమానులే.
గంగోత్రికి అంత ఓపెనింగ్ వచ్చింది తమ వల్లేనని మెగా ఫ్యాన్స్ ఇప్పటికీ అంటుంటారు. అంతెందుకు సాక్ష్యాత్తు బన్నీనే మొదటి షో టికెట్లు తెంపేది వాళ్లేనని ఓ ఈవెంట్ లో చెప్పిన వీడియో మళ్ళీ బయటికి వచ్చింది. ఇప్పుడు మెగా ప్రస్తావన లేకుండా ప్రసంగం చేయడంతో ఒక్కసారిగా ట్విట్టర్ బ్యాచ్ మొత్తం యాక్టివ్ అయ్యింది.
ఇది కాకుండా స్నేహితుల కోసం ఎక్కడికైనా వస్తానని, ఆ మాత్రం చేయకపోతే ఫ్రెండ్ షిప్ ఎందుకని అర్థంవచ్చేలా అల్లు అర్జున్ మాట్లాడ్డం మరో హాట్ టాపిక్. ఆ మధ్య వైసిపి అభ్యర్థి కోసం నంద్యాల వెళ్లి రావడం ఎంత రచ్చకు దారి తీసిందో చూశాం. దాన్ని కవర్ చేయడానికి అల్లు అరవింద్ పిఠాపురం వెళ్తే, బన్నీ వాస్ పలు ప్రెస్ మీట్లలో క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇన్ డైరెక్ట్ గా ఈ వివాదం మీదే ఐకాన్ స్టార్ సమాధానం ఇచ్చాడని వస్తున్న విశ్లేషణలను కాదనలేం. అక్కడ మిసెస్ సుకుమార్ ని ఉద్దేశించి అన్నప్పటికీ టార్గెట్ మాత్రం వేరే డైరెక్షన్ లోకి వెళ్ళిపోయి ఇంకో చర్చకు దారి తీసిన మాట వాస్తవం.
This post was last modified on August 22, 2024 7:51 am
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…