ఈ ఏడాది జూన్ మధ్యలో పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైంది ‘మహారాజ’ మూవీ. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కెరీర్లో ఇది 50వ సినిమా కావడంతో కొంత పబ్లిసిటీ వచ్చింది. ఐతే సోలో హీరోగా సేతుపతి గత కొన్నేళ్లలో చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడని నేపథ్యంలో ఇది కూడా ఆ కోవలోకే చెందుతుందని అనుకున్నారు. కానీ నిథిలన్ స్వామినాథన్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది.
హీరోగా సేతుపతి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. తెలుగులో ఈ సినిమా చాలా బాగా ఆడి లాభాలు తెచ్చిపెట్టడం విశేషం. ఇక ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ కొన్ని వారాల కిందటే విడుదల చేయగా అక్కడ రెస్పాన్స్ ఇంకా అదిరిపోయింది. సోషల్ మీడియా ఈ సినిమా గురించిన చర్చలతో ఊగిపోయింది.
ఇండియా మొత్తంలో ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్‌లో మోస్ట్ వ్యూడ్ మూవీగా ‘మహారాజా’ నిలవడం విశేషం. క్రూ, లాపటా లేడీస్ లాంటి బాలీవుడ్ హిట్ మూవీస్ సాధించిన వ్యూస్‌ను తాజాగా మహారాజ దాటేసింది. మామూలుగా నెట్ ఫ్లిక్స్‌లో ఇండియా వరకు బాలీవుడ్ మూవీసే టాప్‌లో ఉంటాయి. ఎప్పుడో కానీ రీజనల్ మూవీస్ వాటిని అధిగమించవు.
ఐతే కల్ట్ స్టేటస్ తెచ్చుకున్న ‘మహారాజ’ మూవీ మొదట్నుంచి నెట్ ఫ్లిక్స్ ఛార్ట్స్‌ను డామినేట్ చేస్తూ వచ్చింది. అన్ని భాషల వాళ్లూ ఈ చిత్రాన్ని విరగబడి చూశారు. దీంతో వ్యూస్‌లో టాప్‌లోకి వెళ్లిపోయింది. ఈ ఏడాది మరే చిత్రమైనా మహారాజను అధిగమిస్తుందా అన్నది సందేహమే. తన కూతురిపై అత్యాచారం జరిపిన ఒక దొంగల బ్యాచ్‌ను కనిపెట్టి వారికి బుద్ధి చెప్పే తండ్రి కథ ఇది. రొటీన్ కథనే చాలా కొత్తగా ప్రెజెంట్ చేసి, చివర్లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు దర్శకుడు.
This post was last modified on August 21, 2024 5:24 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…