సెప్టెంబర్ 2 కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో చెప్పనక్కర్లేదు. జనసేన వంద శాతం స్ట్రైక్ రేట్ తో ఇరవై ఒక్క సీట్లు గెలిచి, కూటమి ప్రభుత్వంలో తమ హీరో డిప్యూటీ సిఎం అయ్యాక వచ్చిన మొదటి బర్త్ డే కావడంతో భారీ ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గబ్బర్ సింగ్ రీ రిలీజ్ గతంలోనే జరిగినప్పటికీ ఈసారి కనివిని ఎరుగని స్థాయిలో దానికి రికార్డులు సమకూర్చేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉండగా కొత్త సినిమాల అప్డేట్స్ ముఖ్యంగా ఓజి నుంచి ఎలాంటిది వస్తుందనే ఎగ్జైట్ మెంట్ వాళ్ళలో ఎక్కువగా ఉంది.
దానికి నిర్మాత డివివి దానయ్య క్లారిటీ ఇచ్చేశారు. ఓజి టీజర్ ఉంటుందని చెప్పేశారు. నిజానికి మొదటి లిరికల్ వీడియో రావొచ్చనే లీక్ నిన్నటి నుంచే తిరుగుతోంది. మరి చివరి నిమిషంలో ఏమైనా మారుస్తారేమో చూడాలి. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా అతి త్వరలోనే మీ ముందుకు వస్తుందని, షూటింగ్ ని ప్రారంభించబోతున్నామని గుడ్ న్యూస్ చెప్పేశారు. సరిపోదా శనివారం ప్రెస్ మీట్ సందర్భంగా ఈ ముచ్చట్లు జరిగాయి. అయితే ఎప్పుడు, విడుదల తేదీ ఏంటి లాంటి విషయాలు మాత్రం బయటికి రాలేదు. సో ఆ ఎదురు చూపులు మాత్రం ఇంకొంత కాలం తప్పవు.
ఇదే కాదు హరిహర వీరమల్లు నుంచి కూడా ఏదైనా పాట లేదా టీజర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దర్శకుడు జ్యోతి కృష్ణ అదే పనిలో ఉన్నట్టు సమాచారం. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వస్తుందో రాదో ప్రస్తుతానికి చెప్పలేం కానీ విషెస్ అయితే తప్పకుండా ఉంటాయి. రాజకీయాలు, పాలనలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ వీరమల్లు, ఓజికి డేట్లు ఇవ్వడానికి అంగీకారం తెలిపారనేది వారం క్రితమే బయటికి వచ్చింది. మరి షెడ్యూల్స్ ఎలా ప్లాన్ చేస్తారనేది వేచి చూడాలి. ఒకవైపు గబ్బర్ సింగ్ హడావిడి ఇంకోపక్క ఓజి కొత్త కంటెంట్ ఆ రోజు జరిగే రచ్చ మాములుగా ఉండేలా కనిపించడం లేదు.
This post was last modified on August 21, 2024 3:01 pm
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…