‘కల్కి 2898 ఏడీ’ మూవీతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు యువ దర్శకుడు నాగ్ అశ్విన్. దర్శకుడిగా రెండు సినిమాల అనుభవంతో ఈ విజువల్ వండర్‌ను వెండితెరపై ఆవిష్కరించిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. కొన్ని లోపాలున్నప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయం సాధించింది. ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
‘కల్కి’కి కొనసాగింపుగా మరో సినిమా ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అది ఎప్పుడు మొదలవుతుంది.. ఎప్పుడు పూర్తయి విడుదలవుతుంది అనే విషయంలో క్లారిటీ లేదు. అలాగే రెండో భాగంలో కథ, పాత్రల మీద అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. ఈ విషయమై రకరకాల ఊహాగానాలు కూడా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. తాజాగా నాగ్ అశ్విన్.. అభిమానులతో చిట్ చాట్ చేసిన సందర్భంగా ఈ ఊహాగానాలు చర్చకు వచ్చాయి.
‘కల్కి-2’కు సంబంధించిన రూమర్లపై నాగి ఆసక్తికర రీతిలో స్పందించాడు. దీపిక పదుకొనే చేసిన సుమతి పాత్రకు పుట్టిన కుర్రాడే యాస్కిన్‌ను అంతం చేస్తాడని ఓ నెటిజన్ ప్రస్తావించగా.. అందుకు భైరవ ఉన్నాడు కదా, అతనే ఈ కథలో హీరో అని స్పష్టం చేశాడు నాగి. ఫస్ట్ పార్ట్‌లో అర్జునుడి పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ రెండో భాగంలో కీలకంగా ఉంటాడని.. అతను భైరవకు మరింత బలాన్నిస్తాడని ఓ నెటిజన్ పేర్కొనగా.. ఇది ఆసక్తికరంగా అనిపించినా, కేవలం రూమర్ మాత్రమే అని నాగ్ చెప్పాడు.
దుల్కర్ సల్మాన్ సెకండ్ పార్ట్‌లో కూడా ఉంటాడని.. ప్రభాస్ పాత్ర వెనుక ఉన్న మరో నిజాన్ని బహిర్గతం చేస్తాడని ఓ నెటిజన్ పేర్కొనగా అది నిజం కాదనేశాడు నాగి. దీపికకు పుట్టే అబ్బాయి కూడా ప్రభాస్ లాగే ఉంటారని ఒకరు పేర్కొనగా.. ఇది అమెరికన్ సైన్స్ ఫిక్షన్ ‘ది టెర్మినేటర్’ కథలా ఉందని.. ఇది కల్కి కథ కాదని అన్నాడు నాగి. ‘కల్కి-2’కు సంబంధించి ఈ ఊహాగానాలన్నీ ఆసక్తికరంగా ఉన్నాయని.. ఇలాంటివి మరిన్ని ప్రస్తావిస్తే పార్ట్-2కు సంబంధించి తన పని మరింత సులువవుతందని నాగి పేర్కొనడం విశేషం.
This post was last modified on August 21, 2024 2:58 pm
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…