Movie News

మహేష్ బాబు గొంతులో ముఫాసా గర్జన

హాలీవుడ్ మూవీ సిరీస్ లో పిల్లా పెద్దా బాగా ఇష్టపడే వాటిలో లయన్ కింగ్ ఒకటి. కొత్త భాగం ఎప్పుడు వచ్చినా విపరీతమైన అంచనాలతో థియేటర్లను దడదడలాడించేస్తుంది. డిసెంబర్ 20న ముఫాసా ది లయన్ కింగ్ విడుదల కాబోతోంది. దీన్ని ఇండియాలోనూ గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు వాల్ట్ డిస్నీ సంస్థ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాన పాత్రకు డబ్బింగుని అతి పెద్ద స్టార్ హీరోలతో చెప్పించేందుకు రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా తెలుగు వెర్షన్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు గొంతు ఇవ్వబోతున్నట్టు తాజా సమాచారం. ఇది నాలుగైదు రోజుల క్రితమే లీకయ్యింది.

అప్పటికి ఇంకా ఒప్పందం జరగకపోవడంతో అఫీషియల్ గా బయటికి చెప్పలేదు. 26న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో దాన్ని అధికారికం చేయబోతున్నారు. కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ ఇచ్చారనే టాక్ ఉంది కానీ ఎంతనేది బయటికి రాలేదు. ముఫాసాకి మహేష్ గొంతు ఇవ్వడం వల్ల తెలుగు రాష్ట్రాల వరకు బిజినెస్ పరంగా చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే గుంటూరు కారం తర్వాత ఫ్యాన్స్ కు తమ హీరో దర్శనం ఇంకో రెండు మూడేళ్ళ దాకా జరగదు. అప్పటిదాకా పాత సినిమాల రీ రిలీజులతో కాలక్షేపం చేయాలి. ముఫాసాలో గర్జిస్తున్న సింహానికి మహేష్ గొంతు వింటే అదో కొత్త అనుభూతి దక్కుతుంది.

డిసెంబర్ నెలలో మంచి పోటీ ఉన్న తరుణంలో ముఫాసా ది లయన్ కింగ్ వస్తోంది. 2019 లో వచ్చిన భాగానికి ఇది సీక్వెల్ కం ప్రీక్వెల్. అంటే రెండు కథలు ఉంటాయట. ఇంగ్లీష్ లో వచ్చిన ట్రైలర్ ఇప్పటికే అంచనాలు పెంచేసింది. ఈసారి విజువల్ ఎఫెక్ట్స్ మతి పోగొట్టేలా ఉంటాయని, కథా కథనాలు సైతం చాలా మలుపులతో కట్టి పడేస్తాయని అంటున్నారు. మూవీలోని ఇతర పాత్రలకు సైతం పేరున్న ఆర్టిస్టులతోనే డబ్బింగ్ చెప్పించబోతున్నాడు. హిందీ, కన్నడ, మలయాళం, తమిళం తదితర భాషల్లోనూ అగ్ర హీరోలే ముఫాసాకు అండగా నిలవబోతున్నారు. ఫ్యాన్స్ వాటి కోసమే వెయిటింగ్.

This post was last modified on August 21, 2024 2:47 pm

Share

Recent Posts

సుకుమార్ మీద దేవి ఫ్యాన్స్ ఎటాక్

కొంద‌రు ద‌ర్శ‌కులు టెక్నీషియ‌న్ల విష‌యంలో చాలా ప‌ర్టికుల‌ర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…

52 minutes ago

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

6 hours ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

10 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

11 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

12 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

13 hours ago