తెలుగులో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు హను రాఘవపూడి. సీతారామం ముందు వరకు తన కెరీర్లో సక్సెస్ రేట్ ఏమంత గొప్పగా లేకున్నా.. చేసిన ప్రతి సినిమాలోనూ విజువల్ పొయెట్రీతో అతను అభిమానులను సంపాదించుకున్నాడు. ఐతే సీతారామం చిత్రం అతడి మీద అంచనాలను భారీగా పెంచేసింది. తనకు మంచి స్టేటస్ సంపాదించిపెట్టింది.
ఈ క్రమంలోనే ఏకంగా ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నాడు. సలార్, కల్కి లాంటి మెగా హిట్ల తర్వాత ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశం అంటే చిన్న విషయం కాదు. ఇప్పటిదాకా మిడ్ రేంజ్ హీరోలతో సర్దుకుపోయిన హనుకు ఇది చాలా పెద్ద అవకాశమే. ఐతే పెద్ద హీరోతో సినిమా అయినా.. మిడ్ రేంజ్ హీరో కోసం తయారు చేసిన కథనే తెరకెక్కించబోతున్నాడన్నది ఇండస్ట్రీలో ఒక టాక్.
గతంలో హను.. నేచురల్ స్టార్ నానితో ఓ సినిమా చేయడానికి సంప్రదింపులు జరిపాడు. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ తర్వాత వీళ్లిద్దరూ మరో సినిమా చేయాలని అనుకుని చర్చలు జరిపిన కథ అది. అది యుద్ధ నేపథ్యంలో నడిచే ప్రేమ కథ అని.. ‘సీతారామం’ కాకుండా వేరే కథ అని గతంలో హను రాఘవపూడి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కట్ చేస్తే ఆ కథ పక్కకు వెళ్లిపోయింది. దుల్కర్ సల్మాన్‌తో ‘సీతారామం’ తీశాడు.
ఇప్పుడు ప్రభాస్‌తో చేయబోయే సినిమా కూడా యుద్ద నేపథ్యంలో సాగే ప్రేమకథే అనే సంకేతాలు వస్తున్నాయి. దీంతో గతంలో నానితో చేయాలనుకున్న కథకే కాన్వాస్ పెంచి.. ఇంటర్నేషనల్ బ్యాక్ డ్రాప్ తీసుకుని ప్రభాస్‌తో తీస్తున్నాడు అనే చర్చ నడుస్తోంది టాలీవుడ్లో. సోషల్ మీడియాలో కూడా దీని గురించి చర్చ నడుస్తోంది. ఈ ప్రచారంలో నిజం ఎంతో హనునే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
This post was last modified on August 20, 2024 7:28 pm
సంక్రాంతి పండక్కు అందరికంటే ముందు వస్తున్న ఆనందం, అడ్వాంటేజ్ రెండూ గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్…
టాలీవుడ్లో సమస్యలు ఎదురైనప్పుడు.. వాటిని పరిష్కరించే వ్యూహాలు.. చతురత ఉన్న ప్రముఖుల కోసం.. ఇప్పుడు నటులు, నిర్మాతలు ఎదురు చూసే…
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…
‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ…