Movie News

ఓపికతో గెలుస్తున్న న్యాచురల్ స్టార్

ఒక సినిమా పూర్తి చేయడం కన్నా దాన్ని సరైన రీతిలో ప్రమోట్ చేసుకుని ఆడియన్స్ దాకా తీసుకెళ్లడం పెద్ద సవాల్ గా మారుతోంది. స్టార్ హీరో ఉన్నా సరే గుడ్డిగా ఓపెనింగ్స్ ఇచ్చే మూడ్ లో ప్రేక్షకులు లేరు. ఖచ్చితంగా థియేటర్ కు వెళ్లాలనిపించే కంటెంట్ ఉందని వింటేనే కదులుతున్నారు. నాని ఈ సూత్రాన్ని బాగా వంటబట్టించుకున్నాడు. ఆగస్ట్ 29 విడుదల కాబోతున్న సరిపోదా శనివారం కోసం ఏకంగా మూడు రోజులు చెన్నైలో మకాం పెట్టి అడిగిన వాళ్లందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చి, ప్రెస్ మీట్లు నిర్వహించి, కోలీవుడ్ కబుర్లు పంచుకుని ఇలా ఎన్నో విధాలుగా తమిళ మీడియాలో హైలైట్ అయ్యాడు.

చెన్నై బీచ్ లో ఎస్జె సూర్యతో నడవడంతో మొదలుపెట్టి ఎఫ్ఎం రేడియో స్టేషన్ లో ఆర్జెతో కూర్చుని కబుర్లు పంచుకునే దాకా ఎన్నో చేస్తున్నాడు. తాజాగా కేరళ పబ్లిసిటీ కోసం కోచి వెళ్ళిపోయాడు. హీరోయిన్ ప్రియాంకా మోహన్, విలన్ ఎస్జె సూర్య నాని ఎక్కడికి వెళ్లినా తోడుగా ఉంటున్నారు. నిర్మాత డివివి దానయ్య సీన్లో లేకపోయినా, చివరి నిమిషం పనుల వల్ల దర్శకుడు వివేక్ ఆత్రేయ కనిపించలేకపోయినా భారం మొత్తం నాని సింగల్ గా మోస్తున్నాడు. తమిళనాడు, కేరళకు వెళ్ళడానికి ముందే వీలైనన్ని తెలుగు ఇంటర్వ్యూలు ఇచ్చిన నాని తిరిగి వచ్చాక మరిన్ని ప్లాన్ చేయబోతున్నాడు.

చెప్పాలంటే ఒక హీరో ప్రమోషన్ చేయాల్సిన పద్దతి ఇదే. కొత్త సినిమాల షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా ప్రత్యేకంగా టైం కేటాయించుకుని మరీ వివిధ ప్రాంతాలకు వెళ్లడం నిర్మాతలకు ఎంతో మేలు చేస్తుంది. సరిపోదా శనివారం ఏదో విఎఫెక్స్ తో తీసిన విజువల్ గ్రాండియర్ కాదు. ఒక విభిన్నమైన పాయింట్ తో రూపొందిన కమర్షియల్ యాక్షన్ డ్రామా. కంటెంట్ మీద నమ్మకంతో నాని ఎంత దూరమైనా ప్రయాణం చేసి ప్రేక్షకులను చేరుకుంటున్నాడు. ఇలా మరికొందరు స్టార్లు చేస్తున్నారు కానీ అందరూ చేస్తే థియేటర్లకు జనాన్ని రప్పించేందుకు మన వంతు కృషి చేసినట్టు అవుతుంది.

This post was last modified on August 20, 2024 2:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ ప్రసంగంతో ఉప్పొంగిన చిరంజీవి!

జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆ పార్టీ అదినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పరిధిలోని…

24 minutes ago

స్టాలిన్ కు ఇచ్చి పడేసిన పవన్

జనసేన ఆవిర్భావ సభా వేదిక మీద నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా విషయాలను ప్రస్తావించారు. కొన్ని…

10 hours ago

ఛావాకు రెండో బ్రేక్ పడింది

మూడు వారాలు ఆలస్యంగా విడుదలైనా మంచి వసూళ్లతో తెలుగు వెర్షన్ బోణీ మొదలుపెట్టిన ఛావాకు వసూళ్లు బాగానే నమోదవుతున్నా ఏదో…

11 hours ago

ఖైదీ 2 ఎప్పుడు రావొచ్చంటే

సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో…

11 hours ago

దాశరథి, గద్దర్, శ్రీపతి రాములు.. ఎందరెందరో..?

జనసేన ఆవిర్భావ వేడుకల్లో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆ పార్టీ అదినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్… తనను…

12 hours ago

భయం లేదు కాబట్టే… బద్దలు కొట్టాం: పవన్ కల్యాణ్

భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…

13 hours ago