Movie News

జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో క‌ష్టం-హ‌రీష్ శంకర్

టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒక‌డైన జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో రామ‌య్యా వ‌స్తావ‌య్యా సినిమా తీశాడు స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద డిజాస్ట‌ర్ అయింది. మ‌ళ్లీ వీరి క‌ల‌యిక‌లో సినిమా రాలేదు. ఇలాంటి డిజాస్ట‌ర్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు మ‌ళ్లీ అదే హీరోతో ఓ మంచి సినిమా తీసి బ్యాలెన్స్ చేయాల‌ని భావిస్తాడు. కానీ హ‌రీష్ మాత్రం ఇప్పుడు తాను తార‌క్‌తో ప‌ని చేసేందుకు అవ‌కాశం లేద‌ని తేల్చేశాడు.

తార‌క్‌తో మ‌ళ్లీ సినిమా చేస్తారా అని హ‌రీష్‌ను ఓ అభిమాని అడ‌గ్గా.. గతంలో ఎన్టీఆర్‌తో ‘రామయ్య వస్తావయ్య’ చిత్రాన్ని తీశానని.. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయని.. ఎన్టీఆర్‌తో ఇప్పుడు సినిమా చేయడం కష్టమని.. ఆయన లైనప్ గురించి తనకు తెలుసని హరీష్ చెప్పాడు. మ‌రోవైపు తార‌క్ గురించి విలేక‌రులు అడిగిన‌పుడు హ‌రీష్ స్పందిస్తూ.. ఫ్లాప్ అయిన‌ షాక్ సినిమా చూసి తార‌క్ త‌న‌కు ఛాన్స్ ఇచ్చాడ‌ని.. కానీ త‌న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకోలేక‌పోయాన‌ని ఇప్ప‌టికీ బాధ ఉంద‌ని చెప్పాడు. దేవ‌ర పెద్ద హిట్ కావాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు తెలిపాడు.

రామ్‌తో సినిమా ఉంటుందని ఇంత‌కుముందు చేసిన ప్ర‌క‌ట‌న గురించి అడ‌గ్గా.. గ‌తంలోనే రామ్‌తో సినిమా చేయాల‌ని అనుకున్నాన‌ని.. అప్ప‌ట్లో ఓ క‌థ కూడా చెప్పాన‌ని గుర్తు చేసుకున్నాడు. ఐతే అందులో ఇద్ద‌రు హీరోలుంటార‌ని.. రామ్‌కు ఒక్క ఫైట్ కూడా ఉండ‌ద‌ని.. ఆ క‌థ చెప్పిన‌పుడు మ‌నిద్ద‌రం క‌లిసి సినిమా చేస్తే ఫ్యాన్ స్పీడ్ ఐదులో ఉండాలి, ఇదేంటి రెండులో ఉంది అని రామ్ అన్నాడ‌ని.. దీంతో స్పీడ్ ఐదులో ఉండే క‌థ‌తో మ‌ళ్లీ త‌న‌ను క‌లుస్తాన‌ని హ‌రీష్ చెప్పాడు.

ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్న‌ మెగా మ‌ల్టీస్టార‌ర్ గురించి అడిగితే.. దాని గురించి మాట్లాడ్డానికి ఇది స‌మ‌యం కాద‌న్నాడు హ‌రీష్‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అల్లు అర్జున్ అభిమానుల మ‌ధ్య నెల‌కొన్న గొడ‌వ‌ల గురించి అడిగితే అంద‌రూ మ‌న హీరోలే అని సింపుల్‌గా ఆన్స‌ర్ ఇచ్చాడు హ‌రీష్‌.

This post was last modified on August 20, 2024 9:58 am

Share

Recent Posts

అమితాబ్ టెక్నిక్ ఫాలో అయితే… మీ స‌తీమ‌ణి టైమ్‌కి రెడీ!

ఏదైనా పెళ్లో.. మ‌రో ఫంక్ష‌నో.. భార్యా భ‌ర్త‌లు ఇరువురు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు.. స‌హ‌జంగా దంప‌తుల్లో ఉత్సాహం ఉంటుంది. భ‌ర్త ముందుగానే…

6 hours ago

లెక్క తప్పుతున్న యూత్ సినిమాలు

యువతను లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీయడం మంచిదే. అందులోనూ జెన్ జీ అభిరుచులను అర్థం చేసుకుని, వాళ్లకు అనుగుణంగా తక్కువ…

7 hours ago

నిన్న సందీప్ వంగ… నేడు శ్రీకాంత్ ఓదెల

మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…

7 hours ago

దీపావళికి డబ్బింగుల జోరు… టాలీవుడ్ హీరోలు లేరు

నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…

8 hours ago

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

13 hours ago