దక్షిణాది మేటి నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు. తెలుగులో ఆమె చేసిన తొలి చిత్రం ‘అలా మొదలైంది’లోనే తనెంత మంచి నటో అర్థమైంది. ఆ తర్వాత ఆమె ఎన్నో మంచి పాత్రలు చేసింది. తన సొంత భాష మలయాళంలో అయితే గొప్ప గొప్ప సినిమాలు చేసింది. ఆమె నట ప్రతిభ చూసి ఏదో ఒక రోజు జాతీయ అవార్డు అందుకుంటుందనే అనుకున్నారంతా. ఆ సమయం ఇప్పుడొచ్చింది.
తమిళ చిత్రం ‘తిరు చిత్రాంబళం’లో చేసిన శోభన పాత్రకు గాను ఆమె జాతీయ అవార్డు సాధించింది. ఐతే నిత్య ఇంతకంటే గొప్పగా నటించిన సినిమాలున్నాయి. ఉదాత్త కథాంశాలతో తెరకెక్కిన చిత్రాల్లో ఆమె అద్భుతంగా నటించింది. కానీ అలాంటి సినిమాలకు కాకుండా కమర్షియల్ టచ్ ఉన్న ‘తిరుచిత్రాంబళం’ సినిమాలో నటనకు అవార్డు ఇవ్వడం ఒకింత ఆశ్చర్యపరిచింది.
ఈ చిత్రానికి తనకు జాతీయ అవార్డు ఇచ్చారని చెబితే తాను కూడా నమ్మలేదని నిత్య వ్యాఖ్యానించడం విశేషం. “నేను నా తర్వాతి చిత్రానికి సంబంధించి నా ఇంట్లో చర్చల్లో ఉండగా ధనుష్ ఫోన్ చేసి నాకు జాతీయ అవార్డు వచ్చిందన్నాడు. నేను ముందు నమ్మలేదు. జోక్ చేస్తున్నాడని అనుకున్నా. తర్వాత నిజమని తెలుసుకున్నా. ఎంతో ఆనందం కలిగింది. ఇది ఏ జానర్ సినిమా, ఇది ఎలాంటి కథ అని చూడకుండా ఈ పాత్రకు నన్ను అవార్డు కోసం ఎంపిక చేసినందుకు జ్యూరీకి కృతజ్ఞతలు. జాతీయ అవార్డు గెలుచుకునేందుకు తగ్గ స్థాయి ఈ పాత్రకు లేదని కొందరు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు రొమాంటిక్ కామెడీ డ్రామాకు జాతీయ అవార్డు అవసరమా అంటున్నారు. కానీ ఇలాంటి కథలను రాయడం అంత తేలిక కాదు. ఇలాంటి సినిమాలకు కూడా అవార్డులు వస్తాయని శోభన పాత్ర రుజువు చేసింది” అని నిత్యా మీనన్ పేర్కొంది.
This post was last modified on %s = human-readable time difference 9:55 am
నాలుగేళ్ల క్రితం 2021లో అల్లుడు అదుర్స్ తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మళ్ళీ తెలుగు సినిమాలో కనిపించలేదు. అనవసరంగా బాలీవుడ్ మార్కెట్…
అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తే పనయ్యే రోజులు కావివి. అలా చేయొచ్చనుకోవడమే అసలు కామెడీ. ఇటీవలే కన్నడ,…
హీరోయిన్లకు ఒక్కోసారి కెరీర్ లో స్పీడ్ బ్రేకర్ లాంటి దశ వస్తుంది. అప్పుడు ఎంత బ్లాక్ బస్టర్ సాధించినా అవకాశాలు…
పిఠాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లలను అవమానిస్తుంటే చర్యలు తీసుకోరా?…
తమిళ స్టార్ విజయ్ తేరి తెలుగులో పోలీసోడుగా డబ్బింగ్ చేసినప్పుడు మన ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. మొదటిసారి థియేటర్లో చూసిన…
గంభీర్ కోచ్ గా KKK జట్టుకు అందించిన విజయాలు అందరిని ఎంతగానో ఎట్రాక్ట్ చేశాయి. అతను ఏది చెబితే అది…