అల్లు అర్జున్ అంటే మెగా అభిమానుల్లో ఒక వర్గానికి చాన్నాళ్లుగా అస్సలు నచ్చట్లేదు. ఒకప్పుడు మెగా అభిమానులందరూ బన్నీని అభిమానించేవాళ్లు. కానీ కొన్నేళ్ల నుంచి మెగా ఫ్యాన్స్‌లో బన్నీ ఫ్యాన్స్ వేరైపోయారు. ‘సరైనోడు’ ఈవెంట్లో బన్నీ ‘చెప్పను బ్రదర్’ కామెంట్ నుంచి మొదలుపెడితే.. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం చేయడం వరకు అనేక పరిణామాలు ఇందుకు కారణమయ్యాయి. మెగా అభిమానులంతా కలిసే ఉండాలని కోరుకునేవారికి ఈ అగాథాన్ని ఎలా పూడ్చాలో అర్థం కావడం లేదు. ఇందుకు బన్నీనే పూనుకోవాలని.. తన తీరు మార్చుకోవాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ ఆ సంకేతాలు మాత్రం కనిపించడం లేదు.
తాజాగా బన్నీ జాతీయ అవార్డు విజేతలకు విషెస్ చెప్పిన తీరు మళ్లీ వివాదాస్పదం అయింది. దీని మీద అతణ్ని వ్యతిరేకించే మెగా అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ ఉత్తమ నటులుగా ఎంపికైన రిషబ్ శెట్టి, నిత్యా మీనన్‌లతో పాటు తెలుగు నుంచి ‘కార్తికేయ-2’ ఉత్తమ చిత్రంగా నిలిచిన నేపథ్యంలో ఆ చిత్ర బృందానికి బన్నీ విషెస్ చెప్పాడు. అంతే కాక పలు అవార్డులు గెలుచుకున్న మలయాళ చిత్రం ‘ఆట్టం’ బృందాన్నీ అభినందించాడు. కానీ టాలీవుడ్ నుంచి మేటి డ్యాన్స్ మాస్టర్‌గా ఎదిగి.. ‘తిరు చిత్రాంబళం’ చిత్రానికి ఉత్తమ జాతీయ నృత్య దర్శకుడిగా అవార్డు సాధించిన జానీ మాస్టర్‌ను మాత్రం బన్నీ అభినందించలేదు.
జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడు. అతను ఇటీవలి ఎన్నికల్లో జనసేన పార్టీ కోసం కూడా పని చేశాడు. ఈ నేపథ్యంలోనే జానీని బన్నీ పట్టించుకోలేదని.. ఉద్దేశపూర్వకంగానే అతడికి శుభాకాంక్షలు చెప్పలేదని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. బన్నీ యాదృచ్ఛికంగానే జానీ మాస్టర్ పేరు మరిచిపోయి ఉండొచ్చు కానీ.. ఇప్పుడున్న సున్నితమైన పరిస్థితుల్లో మెగా ఫ్యాన్స్‌కు ఇది కూడా పెద్ద తప్పుగా కనిపిస్తోంది. బన్నీ తీరు మారదా అంటూ దీని మీద నెగెటివ్ పోస్టులు పెడుతున్నారు.
This post was last modified on August 20, 2024 9:41 am
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…