టాలీవుడ్లో అదిరిపోయే కటౌట్ ఉన్న హీరోల్లో ప్రభాస్ ముందు వరసలో ఉంటాడు. ఆరున్నర అడుగుల ఎత్తుకు తోడు మ్యాన్లీ లుక్స్‌తో అతను అమ్మాయిల మనసు దోచేస్తుంటాడు. ‘మిర్చి’ లాంటి చిత్రాల్లో ప్రభాస్ లుక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐతే బాహుబలిలోనూ చాలా అందంగా కనిపించిన రెబల్ స్టార్.. ఆ తర్వాత మాత్రం ఆకర్షణీయ లుక్స్‌లో కనిపించలేదు.
సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాల్లో ప్రభాస్ లుక్స్ మీద చాలా విమర్శలు వచ్చాయి. ఇక ప్రభాస్‌లో మునుపటి ఛార్మ్ కనిపించకపోవచ్చనే కామెంట్లు వినిపించాయి. కానీ ప్రభాస్ కష్టపడ్డాడు. తిరిగి తన ఛార్మ్‌ను సంపాదించాడు. ‘సలార్’లో మరీ అందంగా కాకపోయినా.. ఆకర్షణీయంగానే కనిపించాడు. ఇక ‘కల్కి’లో ప్రభాస్ లుక్స్ ప్రశంసలందుకున్న సంగతి తెలిసిందే. ‘రాజా సాబ్’లో అయితే ప్రభాస్ తన అందంతో అందరినీ కట్టిపడేసేలాగే ఉన్నాడు. ఆ సినిమా టీజర్లో అంత చక్కగా ఉన్నాడు మరి.
లేటెస్ట్‌గా ప్రభాస్.. హను రాఘవపూడి సినిమాను మొదలుపెట్టాడు. శనివారమే ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేడుకకు వచ్చిన ప్రభాస్‌ను చూసి అతిథులు, అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ మధ్య కాలంలో ప్రభాస్ ఇంత ఆకర్షణీయంగా కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. సినిమాలో భాగంగా మేకప్‌తో అందంగా కనిపించడం ఒకెత్తు. కానీ ప్రారంభోత్సవ వేడుకకు సింపుల్ మేకప్‌తోనే ప్రభాస్ చాలా అందంగా తయారయ్యాడు. హేర్ స్టైల్ సహా అన్నీ బావున్నాయి.
ఈ లుక్ చూసి ‘మిర్చి’ సినిమాలోని ‘‘ఏమున్నాడ్రా బాబూ’’ అనే అనుష్క డైలాగ్‌ను గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ‘సీతారామం’ తర్వాత హను.. ప్రభాస్ లాంటి మాచో స్టార్‌ను పెట్టి సినిమా తీస్తుండడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రంతో ఇమాన్ ఇస్మాయిల్ అనే కొత్తమ్మాయి కథానాయికగా పరిచయం అవుతోంది. ‘ఫౌజీ’ అనే టైటిల్ అనుకుంటున్నారీ చిత్రానికి.
This post was last modified on August 17, 2024 3:49 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…
‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ…
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమైన డొనాల్డ్ ట్రంప్ మరణశిక్ష అమలుపై తన కఠినమైన వైఖరిని వ్యక్తం చేశారు.…
మాములుగా ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే రెండు వారాల తర్వాత బాగా నెమ్మదించిపోతుంది. మొదటి పది…
పెద్ద అంచనాలతో బాలీవుడ్ మూవీ బేబీ జాన్ రిలీజయ్యింది. విజయ్ బ్లాక్ బస్టర్ తెరీ రీమేక్ గా అట్లీ నిర్మాణంలో…