Movie News

రెండో తంగలాన్ కోసం రంగం సిద్ధం

మొన్న శుక్రవారం విడుదలైన తంగలాన్ కు తెలుగులోనూ మంచి ఓపెనింగ్ వచ్చింది. టాక్ బయటికి రాకముందే ఇది థియేటర్లో చూడాల్సిన సినిమాని ముందే ఒక వర్గం ఆడియన్స్ ఫిక్సయిపోవడంతో మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లాంటి పోటీ ఉన్నా తట్టుకుని నిలబడుతోంది. ట్రైలర్ కట్ దీనికి దోహదం చేసిన మాట వాస్తవం. ఇంత కాంపిటీషన్ లోనూ నెట్టుకురావడం చూసిన టీమ్ తమిళం కన్నా ముందు ఇక్కడ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి హీరో విక్రమ్ ని గెస్టుగా తీసుకొచ్చి మరీ తమ ఆనందాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా చియాన్ విక్రమ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేశాడు.

తంగలాన్ 2 ఉంటుందని దర్శకుడు పా రంజిత్ కోరిక మేరకు ఈ సందర్భాన్ని అనౌన్స్ మెంట్ కోసం వాడుకుంటున్నానని అన్నాడు. నిజానికి తంగలాన్ కు యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. కోలీవుడ్ లోనూ మిశ్రమ స్పందన, రివ్యూలు కనిపించాయి. పాయింట్ బాగున్నప్పటికీ దాన్ని హ్యాండిల్ చేసిన తీరు అంత సంతృప్తికరంగా అనిపించలేదు. విజువల్స్ తో పాటు అప్పటి వాతావరణాన్ని సహజంగా చూపిన వైనం, విక్రమ్ టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ గ్రాఫ్ ని ఎంతో కొంత కాపాడాయి. అంత మాత్రాన సీక్వెల్ డిమాండ్ చేసే మ్యాటర్ ఉందా అంటే ఠక్కున సమాధానం చెప్పలేం.

స్టూడియో గ్రీన్ అధినేతలు తంగలాన్ ను ఆస్కార్ కు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.స్టేజి మీద ఇది కూడా చెప్పేశారు. దానికి సంబంధించిన ప్రొసీజర్ మొదలుపెట్టామని అన్నారు. గ్లామర్ హీరోయిన్ మాళవిక మోహనన్ దెయ్యంగా నటించిన తంగలాన్ కు టెక్నికల్ టీమ్ బలం అండగా నిలిచింది. పొన్నియిన్ సెల్వన్ తరహాలో ఓ మోస్తరుగా ఆడుతుందా లేదా అనేది తేలాలంటే కనీసం ఒక వారం ఆగాలి. అయినా ఇలాంటి టాక్ తో రవితేజ, రామ్ లాంటి వాళ్ళకు ధీటుగా ఈ మాత్రం కలెక్షన్లు రాబట్టడం చూస్తే తంగలాన్ సినిమా కన్నా విక్రమ్ కష్టమే మనోళ్లను ఎక్కువ కదిలించినట్టుంది.

This post was last modified on August 17, 2024 10:31 am

Share
Show comments
Published by
Satya
Tags: Thangalaan 2

Recent Posts

పుష్ప కాదు జై భీమ్ హీరో అంటోన్న సీతక్క!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…

26 minutes ago

చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా సరే..

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…

45 minutes ago

రేవంత్ దగ్గరికి సినీ పెద్దలు?

పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…

1 hour ago

మోహన్ లాల్ సినిమా.. సౌండ్ లేదేంటి?

మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…

1 hour ago

బన్నీ గొడవ.. నేషనల్ మీడియాకు సీపీ క్షమాపణ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…

2 hours ago

మంచి ఛాన్స్ మిస్సయిన రాబిన్ హుడ్!

క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…

2 hours ago