Movie News

హిందీ గోల తగ్గించుకున్న బచ్చన్

మొన్న ప్రీమియర్లతో విడుదలైన మిస్టర్ బచ్చన్ మిశ్రమ స్పందనతో నడుస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రైడ్ రీమేక్ గా రూపొందిన ఈ సినిమాకు మార్పులు మరీ ఎక్కువైపోయి కమర్షియల్ కోటింగ్ పెరగడంతో అంచనాలు అందుకోవడంలో తడబడిందని వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. అయితే కంటెంట్ పరంగా వచ్చిన కంప్లయింట్లలో ప్రధానమైంది పాత హిందీ సినిమా పాటల వాడకం. అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి పాత్ర ద్వారా ఏదో రూపంలో అలనాటి క్లాసిక్స్ ని వినిపించడం మాస్ కి నచ్చలేదు. ఆఖరికి సచిన్ కెడ్కర్ సైతం గాత్రం అందుకోవడం ట్విస్టు.

ఇవన్నీ గమనించిన టీమ్ త్వరగా మేలుకొంది. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం (నిర్మాణాత్మక విమర్శ)ను గౌరవిస్తూ ఈ రోజు నుంచి హిందీ సాంగ్స్ తగ్గించి ట్రిమ్ చేశామని, సెకండ్ షో నుంచి వాటిని చూడొచ్చని దర్శకుడు హరీష్ శంకర్ ప్రకటించాడు. దీన్ని బట్టే ఫీడ్ బ్యాక్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఓల్డ్ సాంగ్స్ వాడటం తప్పేమి కాదు కానీ అందరికి అర్థమయ్యేలా ఉండాలి. కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ లాంటి లెజెండ్ పేర్లు ఇప్పటి తరానికి తెలియదు. అలాంటిది వాళ్ళ పాటలు పరిచయం ఉంటాయనుకోవడం లాజిక్ కాదు. ఒకవేళ పరిచయం చేయాలనుకున్నా కమర్షియల్ సినిమాకు ఫిట్ కాదు.

ఓపెనింగ్స్ విషయంలో తడబడిన బచ్చన్ కు ఈ వారం కీలకం కానుంది. శని ఆదివారాల వరస సెలవులతో పాటు రాఖీa పండగ ఉండటంతో ఆ అవకాశాన్ని వాడుకోవాలి. వచ్చే 23న పెద్దగా చెప్పుకునే సినిమాలు లేకపోవడం కలిసి రావొచ్చు. పోటీలో ఉన్న డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదేలా ఉంది. ఆయ్ కు పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ అది భారీ వసూళ్లుగా మారేందుకు టైం పడుతోంది. ఒకవేళ బాగా పికప్ అయితే మాత్రం ఆడియన్స్ ఫస్ట్ ఛాయస్ ఆయ్ అవుతుందనడంలో సందేహం అక్కర్లేదు. మరి బచ్చన్ చేసుకున్న చిన్న మార్పు ఎలాంటి ఫలితం ఇస్తుందో.

This post was last modified on August 16, 2024 6:37 pm

Share

Recent Posts

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

2 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

2 hours ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

3 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

4 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

5 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

6 hours ago