ఇవాళ సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా దేవర టీమ్ ఒక స్పెషల్ టీజర్ ని రిలీజ్ చేసింది. ఇందులో తను విలన్ గా టాలీవుడ్ కు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. కథకు సంబంధించి ఎలాంటి క్లూస్ ఇవ్వలేదు కానీ కొన్ని యాక్షన్ విజువల్స్ రివీల్ చేశారు. ఎదుటివాడు ఎంత బలవంతుడైనా సరే ఒక్కసారి బరిలో దిగాక మట్టి కరిపించే పోరాట వీరుడిగా చూపించారు. ట్విస్ట్ ఏంటంటే సైఫ్ ఈ నిమిషం వీడియోలోనే రెండు రకాల హెయిర్ స్టయిల్స్ లో విభిన్నంగా దర్శనమిచ్చాడు. ఒకటి మిలిటరీ టైపు కాగా మరొకటి చివరి షాట్ లో జులపాల జుట్టుతో ఉన్నది.
సో దీన్ని డీ కోడ్ చేస్తే ఒక విషయం అర్థమవుతుంది. దేవరలో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి గతంలోనే లీకయ్యింది. అంటే సైఫ్ అలీ ఖాన్ యువకుడిగా ఉన్నప్పుడు, తర్వాత మధ్య వయసు దాటినప్పుడు ఇలా రెండుసార్లు తారక్ తో శత్రుత్వం వచ్చే సందర్భం వస్తుందన్న మాట. లేదంటే ఇతను కూడా ద్విపాత్రానభినయం చేసుండాలి. ఏదో ఒకటి నిజమై ఉండకపోదు. మరి కొత్తగా ప్రచారంలోకి వచ్చిన బాబీ డియోల్ క్యారెక్టర్ బహుశా సైఫ్ కొడుకు అయ్యుండొచ్చు. డీటెయిల్స్ అయితే ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి కానీ ఎంతమేరకు నిజమో విడుదలయ్యాక చూడాలి.
వచ్చే నెల 27 విడుదల కాబోతున్న దేవర పార్ట్ 1 పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారు. ఇంకో 40 రోజులు మాత్రమే టైం ఉండటంతో ఆఘమేఘాల మీద పరుగులు పెట్టాలి. మరో రెండు వారాల్లో అనిరుద్ రవిచందర్ రీ రికార్డింగ్ మొదలుపెట్టొచ్చని ఇన్ సైడ్ న్యూస్. భారీ అంచనాలతో బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుపుకుంటున్న దేవర 2024లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా పరిచయమవుతుండగా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మురళి శర్మ, అజయ్, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
This post was last modified on August 16, 2024 5:40 pm
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…