స్త్రీ.. ఆరేళ్ల కిందట హిందీలో సూపర్ హిట్ అయిన హార్రర్ కామెడీ మూవీ. పాతికేళ్ల కిందట దక్షిణాదిన కొన్ని రాష్ట్రాల్లో దయ్యం భయంతో బెంబేలెత్తిన జనాలు.. ‘ఓ స్త్రీ రేపు రా’ అని ఇంటి తలుపుల మీద రాసుకుని భయం గుప్పెట్లో బతికిన సంఘటల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఐతే దీన్ని మించిన హార్రర్ కామెడీలు తెలుగులో బోలెడన్ని వచ్చాయి. కానీ హిందీ ప్రేక్షుకులకు ఆ టైంకి ఇది కొత్తగా అనిపించి పెద్ద హిట్ చేశారు. స్టార్లు లేకపోయినా ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించింది.
రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఆరేళ్ల తర్వాత దీనికి సీక్వెల్ తీసింది టీం. రాజ్ కుమార్, శ్రద్ధ ఇందులోనూ నటించారు. తమన్నా భాటియా ఒక ఐటెం సాంగ్ చేసింది. ఐతే ఇండిపెండెన్స్ డే వీకెండ్లో దీంతో పాటు ఖేల్ ఖేల్ మే, వేదా లాంటి పెద్ద సినిమాలు రిలీజైనా.. స్త్రీ బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది.
అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తేనే.. స్త్రీ-2 సెన్సేషన్ క్రియేట్ చేయబోతోందనే సంకేతాలు కనిపించాయి. ఇప్పుడు ట్రేడ్ పండిట్ల అంచనాలను కూడా మించిపోయి అనూహ్యమైన ఓపెనింగ్స్ తెచ్చుకుంది ‘స్త్రీ-2’. ముందు రోజు రాత్రి వేసిన పెయిడ్ ప్రిమియర్స్‌ను కూడా కలుపుకుంటే తొలి రోజు ‘స్త్రీ-2’ ఏకంగా రూ.64 కోట్ల వసూళ్లు సాధించడం విశేషం. స్టార్ హీరోలు లేని.. లేడీ ఓరియెంటెడ్ టచ్ ఉన్న సినిమాకు ఈ వసూళ్లు అనూహ్యం. పెద్ద పెద్ద స్టార్లకు కూడా పాతిక కోట్ల ఓపెనింగ్స్ గగనం అయిపోతోంది బాలీవుడ్లో. అలాంటిది ‘స్త్రీ-2’ ఏకంగా 64 కోట్ల ఓపెనింగ్స్‌లో బాలీవుడ్ ఆల్ టైం ఓపెనర్లలో ఒకటిగా నిలిచింది. గత కొన్నేళ్లలో ఓ హిందీ సినిమాకు వచ్చిన అత్యధిక తొలి రోజు వసూళ్లు ఇవే.
సినిమాకు టాక్ బాగుండడంతో వీకెండ్ అయ్యేసరికి ఈ చిత్రం రూ.200 కోట్ల మార్కును అలవోకగా దాటేసేలా ఉంది. మరోవైపు అక్షయ్ కుమార్ ముఖ్య పాత్ర పోషించిన ఖేల్ ఖేల్ మే, జాన్ అబ్రహాం హీరోగా నటించిన వేదా చిత్రాలు యావరేజ్ వసూళ్లతో నడుస్తున్నాయి.
This post was last modified on August 16, 2024 3:56 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…