Movie News

థియేటర్లకు ఊపిరిచ్చిన ఇండిపెండెన్స్ డే

చాలా రోజుల తర్వాత నిన్న థియేటర్లు సందడి సందడిగా కనిపించాయి. కొత్త రిలీజులతో హాళ్లు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టుకుని క్యాంటిన్ నుంచి పార్కింగ్ స్టాండ్ దాకా సిబ్బంది మొత్తం బిజీగా కనిపించారు. టాక్స్ సంగతి పక్కనపెడితే పేరున్న పెద్ద హీరోల సినిమాలే ఎక్కువ కావడంతో మొదటి రోజు చూసేద్దామన్న ప్లాన్ తో టికెట్లు కొన్న వాళ్లే ఎక్కువ. ఫ్యామిలీ ఆడియన్స్ సైతం భారీ సంఖ్యలో రావడం అడ్వాన్స్ బుకింగ్స్ లోనే స్పష్టమయ్యింది. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగలాన్ మూడూ ఒకే తరహా స్పందన దక్కించుకున్నప్పటికీ ఓపెనింగ్స్ బాగున్న వైనం వసూళ్లలో తేటతెల్లమయ్యింది.

ఊహించిన విధంగా నార్త్ లోనే అనుకుంటే తెలుగు రాష్ట్రాల్లోనూ బాలీవుడ్ మూవీ స్త్రీ 2కి రెస్పాన్స్ బాగుంది. ప్రీమియర్ల ప్లాన్ వర్కౌట్ కాగా హిందీ ప్రేక్షకులు దీనివైపే మొగ్గు చూపారు. ఇక చిన్న చిత్రం ఆయ్ కు బాగుందనే టాక్ ఇవాళ్టి నుంచి ఉపయోగపడాలి. నిన్న పోటీ వల్ల పెద్ద నెంబర్లు కనిపించలేదు కానీ ఈ రోజు నుంచి గణనీయంగా మార్పు ఉంటుందని బయ్యర్ల అంచనా. గత వారం విడుదలైన కమిటీ కుర్రోళ్ళకు ఈ వారం కూడా జోరు కొనసాగేలా ఉంది. బుక్ మై షో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. కల్కి 50 రోజులు పూర్తి కావడంతో థియేట్రికల్ రన్ కు పూర్తి సెలవు ఇచ్చేసింది.

ఇప్పుడీ కొత్త జోరు ఎన్ని రోజులు ఉంటుందనేది కీలకం. వచ్చే వారం చెప్పుకోదగ్గ విడుదలలు లేవు. రావు రమేష్ మారుతినగర్ సుబ్రహ్మణ్యంతో పాటు మరో రెండు చిన్న సినిమాలు అనౌన్స్ చేశారు కానీ ప్రమోషన్ తాలూకు సందడి కనిపించడం లేదు. ఇంద్ర రీ రిలీజ్ మీద మెగా ఫ్యాన్స్ అంచనాలు మాములుగా లేవు. ఆగస్ట్ 29 నాని సరిపోదా శనివారం వచ్చేదాకా ఇండిపెండెన్స్ డే సినిమాలకు ఢోకా లేదు. రెండు వారాల సమయముంది. కాకపోతే టాక్ ని తట్టుకుని రవితేజ, రామ్, విక్రమ్ లు ఏ మేరకు నెగ్గుకు వస్తారో చూడాలి. ఏదైతేనేం బాక్సాఫీస్ కు జోష్ అయితే వచ్చేసింది.

This post was last modified on August 16, 2024 3:51 pm

Share

Recent Posts

పులివెందుల ఎన్నికల్లో హింసకు స్కెచ్?

ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు ఎంత హుందాగా వ్యవహరించాలి? ఒకవేళ కిందిస్థాయి నేతలో, కార్యకర్తలో ఆవేశపడి…

3 hours ago

చిరంజీవి చెప్పాల్సిన అసలు ముచ్చట

కొన్ని రోజులుగా నెట్ ఫ్లిక్స్ కోసం చిరంజీవి చేస్తున్న టాక్ షో 'మెగావర్స్' వార్తలు సోషల్ మీడియా, మీడియాలో తెగ…

4 hours ago

ఎంత మంచి పని చేశావ్ మాలా

ఇవాళ విడుదలైన ఆదర్శ కుటుంబం ఏకె 47 ప్రాధమిక స్పందన సానుకూలంగానే కనిపిస్తోంది. కంటెంట్ పరంగా హెచ్చుతగ్గుల మీద కొన్ని…

7 hours ago

నయనతార మీద అంత నమ్మకమా

దీపావళికి విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి రామాయణ పార్ట్ 1, సూర్య సీన్ మీద ఉంది కానీ నయనతార…

8 hours ago

చంద్రబాబు ఏమైనా జోక్ చేస్తున్నారా?

టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు తాజాగా సీరియ‌స్ అయ్యారు. ఇంత సీరియ‌స్‌గా చెబుతున్నా.. మీకు అర్ధం కావ‌డం లేదా? లేక‌..…

9 hours ago

వార‌ణాసి ఆ డేట్‌కే వ‌స్తుందా అండీ?

2027 సంవ‌త్స‌రంలో ఇండియ‌న్ ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో భారీ చిత్రాలు రిలీజ‌వుతున్నాయి. కానీ వాటిలో అత్య‌ధిక అంచ‌నాలున్న‌ది వార‌ణాసి మీదే…

10 hours ago