సీనియర్ కమెడియన్లను వాడుకోవడం ఒక ఆర్టు. అది సరిగ్గా తెలిసిన దర్శకులు అద్భుతాలు చేయొచ్చు. ఈ మధ్యకాలంలో బ్రహ్మానందం లాంటి లెజెండరీ ఆర్టిస్టుని మొక్కుబడి సీన్లలో ఎలా వృథా చేసుకుంటున్నారో కళ్లారా చూస్తున్నాం. ఆయన వరకు డైరెక్టర్లు అడిగినట్టు చేస్తున్నారు కానీ బలహీనమైన సన్నివేశాల వల్ల ఉపయోగపడలేకపోతున్నారు. ఇప్పుడు అలీ కూడా అదే రూట్లో వెళ్తున్నారు. నిన్న రిలీజైన డబుల్ ఇస్మార్ట్ విమర్శల్లో మొదటి అంశం బోకా కామెడీ ఎపిసోడ్. అడవి నుంచి పారిపోయి వచ్చిన మనిషిగా అలీ చేసిన చిత్ర విచిత్ర విన్యాసాలు నవ్వించకపోగా ఎబ్బెట్టు కలిగించాయి.
ఒకప్పుడు ఇదే పూరి అలీ కలయికలో బీహార్ ఇసుక పేరుతో ఇడియట్ లో ఎంత బ్రహ్మాండమైన కామెడీ పండించారో రవితేజ అభిమానులు ఎప్పటికి మర్చిపోలేరు. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయిలో అమాయకుడు, పోకిరిలో బిచ్చగాడు, బద్రిలో పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కాంబోలో వచ్చిన ఆణిముత్యాలు బోలెడు. కానీ డబుల్ ఇస్మార్ట్ లో ఆ మేజిక్ మచ్చుకు కూడా కనపడలేదు సరికదా రివర్స్ అయ్యింది. పరిస్థితి ఎలా ఉందంటే పలు చోట్ల డిస్ట్రిబ్యూటర్లు అలీ ట్రాక్ మొత్తం తీసేస్తే టాక్ కొంత మెరుగు పడుతుందని చెబుతున్నారట. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.
హాస్యనటులను వాడుకోవడంలో కొత్త జనరేషన్ డైరెక్టర్లే మెరుగ్గా ఆలోచిస్తున్నారు. టీవీ, యూట్యూబ్ ఇలా ఎన్నో ఆప్షన్లలో వినోదం దొరుకుతున్న టైంలో ఎప్పుడో దశాబ్దాల నాటి జోకులతో జనాన్ని నవ్వించాలంటే కుదరదు. రాత తీత రెండు విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వందల సినిమాలు చేసిన బ్రహ్మానందం, అలీలు ఫలానా చిత్రం చేయకపోయి ఉంటే బాగుండేదని వాళ్ళ ఫ్యాన్స్ ఫీలయ్యే దాకా తీసుకురాకూడదు. మిస్టర్ బచ్చన్ ఫలితాన్ని పక్కనపెడితే బాబు మోహన్, రవితేజ సీన్ ఉన్నది కాసేపే అయినా హుందాగా ఉంది. ఇలాంటి కోణాల్లో ఆలోచించి రాస్తే బెటరేమో.
This post was last modified on August 16, 2024 12:02 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…