ఒక స్టార్ హీరో సినిమాలో ఇంకో స్టార్ హీరో క్యామియో రోల్ చేయడం మామూలే. కొన్నిసార్లు ఆ హీరో రేంజి కంటే పెద్ద ఇమేజ్ ఉన్న హీరోనే క్యామియో పాత్రకు తీసుకుంటారు. అలాంటి పాత్రలు కొన్ని నిమిషాలు కనిపించినా ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ప్రేక్షకులకు మంచి కిక్.. సినిమాకు మంచి బూస్ట్ ఇస్తాయి.
ఐతే టాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ ‘మిస్టర్ బచ్చన్’లో ఎవ్వరూ ఊహించని క్యామియో ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ పాత్ర చేసింది యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ కావడం విశేషం. ఈ చిత్రంలో అతను ప్రత్యేక పాత్ర పోషించారని ఎవ్వరికీ తెలియదు. దాన్నొక సర్ప్రైజ్ లాగా దాచిపెట్టారు. కనీసం ఇందులో ఒక సర్ప్రైజ్ క్యామియో ఉందని కూడా టీం వేదికల మీద చెప్పలేదు. దీంతో నిజంగా ప్రేక్షకులు సినిమాలో సిద్ధును చూసి ఆశ్చర్యపోయారు.
మన సినిమాల్లో హీరో కుటుంబం ఆపదలో ఉంటే.. ఇలాంటి క్యామియోతో మరో హీరో రంగప్రవేశం చేసి కాపాడ్డం కామనే. బ్రూస్ లీ, జైలర్.. ఇలా చాలా సినిమాల్లో ఇలాంటివి చూడొచ్చు.
ఐతే మాస్ రాజా లాంటి పెద్ద స్టార్ సినిమాలో.. సిద్ధు క్యామియో చేశాడంటే తన రేంజ్ ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో అతడికి యూత్‌లో మాంచి ఫాలోయింగ్ వచ్చింది. దీన్ని హరీష్ శంకర్ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశాడు ‘మిస్టర్ బచ్చన్’లో. ప్రి క్లైమాక్స్‌లో చిక్కుల్లో పడ్డ హీరో ఫ్యామిలీని సిద్ధునే రక్షిస్తాడు. తన ఎంట్రీతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ‘టిల్లు’ స్టైల్ కొనసాగిస్తూ తనదైన శైలిలో పంచ్ డైలాగులు పేలుస్తూ సిద్ధు ఉన్న కొన్ని నిమిషాలు అలరించాడు. ‘మిస్టర్ బచ్చన్’ సినిమా అంచనాలకు తగ్గట్లు లేకపోయినా ఈ క్యామియో మాత్రం బాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
This post was last modified on August 16, 2024 10:14 am
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…