ఒక మాదిరి హీరోల వరకు నిర్మాతలు నయానో భయానో షూటింగ్‍కి రప్పించేసుకున్నారు. ఇంతవరకు తిరిగి మొదలైన షూటింగ్స్ అన్నీ కూడా మిడ్ రేంజ్ హీరోలవే తప్ప అగ్ర హీరోల సినిమాలేవీ మొదలు కాలేదు. అక్కడ నిర్మాతల పప్పులుడకవు. దర్శకుల మాట చెల్లదు. ఆ హీరోలు వస్తేనే షూటింగ్… లేదంటే లేదు. ప్రస్తుతం అగ్ర హీరోలెవరూ రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేరు.
ఇప్పటికయితే అక్టోబర్ లేదా నవంబర్‍లో చూద్దామంటూ వాయిదా వేసారు. అప్పటికి అయినా వస్తారో లేదో తెలియదు. చిన్న సినిమాల షూటింగ్స్ అంటే పెద్దగా సిబ్బంది లేకుండా కూడా చేసేసుకోవచ్చు. అందులోను మొదలైన సినిమాలన్నీ కూడా షూటింగ్ చివరి దశలో వున్నవి కనుక మరీ అంత టూమచ్‍గా వర్రీ అయిపోనక్కర్లేదు. కానీ అగ్ర హీరోల సినిమాల్లో చాలా వరకు ఇంకా ఆరంభం లేదా మిడ్ స్టేజీల్లోనే వున్నాయి.
కరోనా బారిన పడి ప్రముఖులు మరణిస్తూ వుండడంతో హీరోలు మరింతగా బిగుసుకుపోతున్నారు. వాక్సిన్ వచ్చినా రాకున్నా కనీసం కేసులయినా తగ్గుముఖం పట్టాలని హీరోలు ఫిక్సయ్యారు. దీంతో ఆయా సినిమాల నిర్మాతలు వాళ్లెప్పుడొస్తే అప్పుడు షూటింగ్ చేసుకుందామని ఎదురు చూస్తున్నారు.
This post was last modified on September 26, 2020 9:39 pm
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…