సినిమా ఇండస్ట్రీలో దర్శకులు అంతా ఒక కంఫర్ట్ జోన్‍లోనే వుండడానికి ఇష్టపడతారు. పోకిరి తర్వాత పూరి జగన్నాథ్ అదే తరహా సినిమాలకు ఫిక్స్ అయిపోయాడు. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ ఆ జోన్ నుంచి బయటకు రాలేదు. అలాగే అతనికి ‘ఇస్మార్ట్ శంకర్’తో సక్సెస్ వచ్చింది. త్రివిక్రమ్ కూడా ఫ్యామిలీ సినిమాలను దాటి బయటకు రావడం లేదు. అదే విధంగా కొరటాల శివ సోషల్ మెసేజ్ మిళితమైన కమర్షియల్ సినిమాలు చేస్తుంటాడు. వేరే రకం సినిమాలు చేయాలని వున్నా కానీ కంఫర్ట్ జోన్ బయటకు వస్తే రిస్క్ అని డైరెక్టర్స్ ఫీలవుతుంటారు.
అలాగే చిన్న సినిమాలతో సక్సెస్ అయిన ఇంద్రగంటి మోహనకృష్ణ ‘వి’తో బడ్జెట్ బాగా పెంచాడు. ఆ సినిమాను సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడనే విమర్శలు రావడంతో అతడితో డెబ్బయ్ కోట్ల సినిమా ఒకటి అనుకున్న దిల్ రాజు అది కాన్సిల్ చేసేసుకున్నాడు. నాగచైతన్యతో అమెరికా బ్యాక్‍డ్రాప్‍లో కాస్ట్లీ లవ్‍స్టోరీ ఒకటి ప్లాన్ చేసుకుంటూ వుంటే వేరే కథ చూడమని చైతన్య చెప్పేసాడు.
పది, పదిహేను కోట్ల బడ్జెట్‍లో చిన్న సినిమా ఏదైనా ప్లాన్ చేయమని దిల్ రాజు చెప్పినట్టు మీడియాలో రాస్తున్నారు. ఒక్కసారి కంఫర్ట్ జోన్ దాటి బయటకు రాగానే ఈ టాలెంటెడ్ దర్శకుడికి నెక్స్ట్ సినిమా ఏమిటనే క్లారిటీ కూడా రావడం లేదు. మిగతా అన్ని భాషలలో దర్శకులు ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు కానీ టాలీవుడ్‍లో మాత్రం ధైర్యం చేయరంటే కారణమిదే.
Gulte Telugu Telugu Political and Movie News Updates