ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న మాటలు క్రమంగా చిన్న మంట నుంచి అడవిని కాల్చేసిన దవానలంలా మారుతున్నాయి. నిన్న విశాల్ క్షమాపణ డిమాండ్ చేస్తూ సుదీర్ఘమైన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నాజర్ కూడా సారీ చెప్పాల్సిందేనన్న రీతిలో నిరసన స్వరం వినిపించారు.
ఇప్పటిదాకా కొందరికే తెలిసిన విషయం కాస్తా తమిళనాడు వర్గాల్లో అందరికీ రీచ్ అవుతోంది. ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే ఎంజీఆర్ అంటే కోట్లాది అభిమానులకు ఆరాధ్య దైవం. మనిషి లేకపోయినా ఆయన ప్రభావం ఇప్పటికీ సినీ, రాజకీయ రంగాల్లో బలంగా ఉంది. అందుకే రాజేంద్ర ప్రసాద్ మాటల మీద ఇంత వ్యతిరేకత వస్తోంది. ఇది క్రమంగా పెద్దగా కాకుండా ఆపడం చాలా అవసరం.
ఎంత తెలుగువాడైనా రాజేంద్రప్రసాద్ కు కోలీవుడ్ నటీనటులతో కలిసి పని చేసిన అనుభవముంది. పలు స్ట్రెయిట్ తమిళ సినిమాల్లో కూడా నటించారు. క్విక్ గన్ మురుగన్, నీ, అన్నాబెల్లె సేతుపతిలో నటించారు. ఇక బోలెడు డబ్బింగ్ చిత్రాల ద్వారా నటకిరీటి అక్కడ ఉన్న వాళ్లకు సుపరిచితుడే. సో ఏదో అనామకుడు అన్నాడని లైట్ తీసుకునే ప్రసక్తి ఉండదు. ఇప్పుడీ ఇష్యూ ట్విట్టర్ లో వైరల్ టాపిక్ అవుతోంది.
పోనీ ఆయనకు మద్దతుగా నిలబడే అవకాశాన్ని కూడా నటకిరీటి ఇవ్వలేదు. ఎందుకంటే అన్నది ఏదో మెసేజ్ రూపంలో కాదు. వీడియో ప్రూఫ్ ఉంది. సమర్ధించుకునే ఛాన్స్ ఒక్క శాతం కూడా లేదు. కాంతారావుగారిని పొగిడే క్రమంలో ఎంజీఆర్ ని తక్కువ చేయడం ఇంత సమస్య అయ్యింది. పోనీ ఈ ఇద్దరూ సమాన స్థాయి వ్యక్తులైతే ఏదోలా కవర్ చేయొచ్చు. కానీ ఆ ఛాన్స్ కూడా మిస్ అయ్యింది. కత్తివీరుడిగా పేరున్న కాంతారావు ఎంత గొప్పవారైనా ఎంజిఆర్ స్థాయికన్నా పెద్ద అనడం పొరపాటు కాదు పెద్ద తప్పు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
