నిన్న విడుదలైన సరిపోదా శనివారం ట్రైలర్ చూశాక అందరి మదిలో మెదిలిన ప్రశ్న ఒకటుంది. నిజంగా ఇది వివేక్ ఆత్రేయ తీసిన సినిమానేనా అని. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన తీసినవి సింపుల్ అండ్ సాఫ్ట్ స్టోరీస్. మెంటల్ మదిలో ఎక్కువగా ఎమోషన్స్ ప్లే అవుతాయి. బ్రోచేవారెవరురా కిడ్నాప్ డ్రామా అయినప్పటికీ కామెడీ హైలైట్ అవుతూ ఎక్కడ బోర్ కొట్టకుండా నడుస్తుంది. ఇక గత ఏడాది వచ్చిన అంటే సుందరానికి కల్ట్ ఫాలోయింగ్ ఎక్కువ. కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాకపోయినా కులాంతర ప్రేమకథని అందంగా చూపించిన వైనం ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించింది.
కట్ చేస్తే వివేక్ ఆత్రేయ పూర్తిగా రూటు మార్చేసి మాస్ ప్లస్ యాక్షన్ దారి వైపుకు వచ్చేయడం ఆశ్చర్యపరుస్తోంది. మూడు నిమిషాల వీడియోలో హాస్యం కనిపించలేదు. మొత్తం సీరియస్ టోన్ లోనే సాగింది. ఎస్జె సూర్య విలనిజంని డిజైన్ చేసిన తీరు, నాని పాత్రకు పెట్టిన రెండు వేరియేషన్స్, హీరోయిన్ ప్రియాంక మోహన్ ని గ్లామర్ షోకు వాడకపోవడం ఇలా ఎన్నో అంశాలు కొత్తగా అనిపించాయి. అన్నింటి కంటే ప్రధానమైంది కథను దాచకుండా అరటిపండు వలిచినట్టు మొత్తం చెప్పేయడం. దీన్ని బట్టి టీమ్ కంటెంట్ మీద ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అర్థమవుతోంది.
సరిపోదా శనివారం తనకు స్టార్ లీగ్ లోకి తీసుకెళ్తుందనే నమ్మకం వివేక్ ఆత్రేయలో బలంగా ఉంది. భావోద్వేగాలతోనే ఎక్కువ సినిమాలు చేస్తే స్టార్లతో ఛాన్స్ రాకపోవచ్చు. కానీ మాస్ ఎంటర్ టైనర్లు క్లిక్ అయితే అనిల్ రావిపూడి తరహాలో టయర్ 1 హీరోలతో జట్టు కట్టొచ్చు. చూస్తుంటే ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేలానే ఉంది. ఆగస్ట్ 29 విడుదల కాబోతున్న సరిపోదా శనివారం కోసం నాని సహజంగానే తీసుకునే గ్యాప్ కంటే ఎక్కువ ఇచ్చాడు. దసరా, హాయ్ నాన్న తర్వాత హ్యాట్రిక్ ఇచ్చే మూవీగా అభిమానులు దీని మీద బోలెడు నమ్మకం పెట్టుకున్నారు. నిజమవ్వాలి కూడా.
This post was last modified on %s = human-readable time difference 11:19 am
ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…