ముందు అనుకున్నట్టే షూటింగ్ పూర్తయి సకాలంలో పోస్ట్ ప్రొడక్షన్ జరిగి ఉంటే ఈ రోజు దేశవ్యాప్తంగా పుష్ప 2 ది రూల్ గురించి తప్ప ఇంకే డిస్కషన్ ఉండేది కాదు. ఆగస్ట్ 15 ఖచ్చితంగా రావాలనే లక్ష్యంతో అల్లు అర్జున్, సుకుమార్ ఎంత ప్రయత్నించినా ఆ డెడ్ లైన్ అందుకోలేక వదిలేశారు. వాయిదా పడొచ్చనే వార్త లీకవ్వడం ఆలస్యం ఒక్కసారిగా ఇతర నిర్మాతలు అలెర్టయ్యారు. ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ తో మొదలుపెట్టి రాఖీ పండగ దాకా వరస సెలవులు ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని వదులుకోకూడదని ఆఘమేఘాల మీద పనులన్నీ పూర్తి చేసుకున్నారు.
కట్ చేస్తే ఏకంగా నాలుగు తెలుగు సినిమాలు, మూడు హిందీ చిత్రాలు బరిలో నిలిచాయి. ముందుగా తెలుగు సంగతి చూస్తే మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లు ఎక్కువ ప్రయోజనం పొందేందుకు తహతహలాడుతున్నాయి. ఎలాగూ బాక్సాఫీస్ వద్ద మాస్ కంటెంట్ వచ్చి వారాలు గడిచిపోయాయి. టాక్ పాజిటివ్ వస్తే చాలు ఏబీసీ తేడా లేకుండా కలెక్షన్లు హోరెత్తిపోతాయి. అడ్వాన్స్ బుకింగ్స్ దాన్నే స్పష్టం చేస్తున్నాయి. అటు నార్త్ లో స్త్రీ 2 భీభత్సం మాములుగా లేదు. అంచనాలకు మించి ఇప్పటికే మూడు లక్షల టికెట్ల అమ్మకాలు జరిగిపోయాయి. ఖేల్ ఖేల్ మే, వేదా దీని దరిదాపుల్లో కూడా లేవు.
పుష్ప చేసింది త్యాగమా కాదానేది పక్కన పెడితే ఒక గోల్డెన్ డేట్ ని వదిలేసిన మాట ఒప్పుకోవాల్సిందే. ఇలాంటి క్రేజ్ ఉన్న ప్యాన్ ఇండియా మూవీస్ ఎప్పుడు వచ్చినా ఆడతాయి కానీ సరైన సీజన్ అయితే ఓ యాభై వంద కోట్లు అదనంగా వస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఆగస్ట్ సంక్రాంతి సీజన్ ని తలపిస్తోంది. మూవీ లవర్స్ మాత్రం ముందు ఏది చూడాలో అర్థం కాక తలలు పట్టేసుకుంటున్నారు. అన్నీ మొదటి రోజే చూడాలనుకునే వాళ్లకు మాత్రం ఇంటి నుంచి క్యారేర్లు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. చూడాలి పుష్ప వదలేసిన బంగారు బాతుని ఎవరు వండుకుంటారో.
This post was last modified on August 14, 2024 10:38 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…