దేవరకు అనిరుద్ రవిచందర్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నప్పటి నుంచి అభిమానుల్లో ఒకవైపు ఆనందం మరోవైపు అనుమానం రెండూ ఒకేసారి తలెత్తాయి. కారణం తమిళంలో ఇచ్చినంత అద్భుతంగా తెలుగులో ఆల్బమ్స్ ఇవ్వలేదనే కంప్లయింట్ ఉండటమే. జెర్సీ, అజ్ఞాతవాసి, గ్యాంగ్ లీడర్ లో మంచి పాటలు ఉన్నప్పటికీ ఎవర్ గ్రీన్ కాలేకపోయాయి. అందుకే టెన్షన్ పడ్డారు. పైగా కమల్ హాసన్ భారతీయుడు 2తో తీవ్ర నిరాశకు గురి చేశాక డౌట్లు మరింత ఎక్కువయ్యాయి. క్రమంగా అవన్నీ మబ్బుల్లా వీడిపోతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. కారణం సాంగ్స్ కొచ్చిన రెస్పాన్సే.
ఇటీవలే వచ్చిన చుట్టమల్లే తెలుగు వెర్షన్ వారం తిరక్కుండానే 53 మిలియన్ల వ్యూస్ దాటేసింది. ఇతర భాషలు కలుపుకుంటే సెంచరీ దాటేస్తుంది. రీల్స్ రూపంలో ఇప్పటికే రెండు లక్షల మంది దీన్ని అనుకరించారని రిపోర్ట్. ఈ నెంబర్ అంతకంతా పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. దీని కన్నా ముందు వచ్చిన ఫియర్ సాంగ్ 47 మిలియన్ల వ్యూస్ తో కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ రీచ్ మాత్రం ఓ రేంజ్ లో వెళ్లిన మాట వాస్తవం. నెక్స్ట్ రాబోయే ఆయుధపూజ, తారక్ జాన్వీ డాన్సింగ్ పాట కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నెలాఖరులోపు మరొకటి వచ్చేస్తుంది.
సో అనిరుద్ రవిచందర్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని గెలిచే దిశగా దేవరకు పనిచేస్తున్న వైనం స్పష్టమైంది. ఇక అసలైన ఛాలెంజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో ఉంది. దేవరకు బీజీఎమ్ ప్రాణంగా నిలవాల్సి ఉండటంతో దర్శకుడు కొరటాల శివ దానికి తగినంత సమయం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 27 ఎంతో దూరం లేదు కాబట్టి వీలైనంతగా పనులు వేగవంతం చేయాలి. సెప్టెంబర్ మొదటి వారంలోపు ఫైనల్ కాపీ ఇచ్చేస్తే అనిరుద్ రీరికార్డింగ్ కు తగినంత సమయం దొరుకుతుంది. జైలర్, విక్రమ్ మించిన స్కోర్ ఇవ్వాలని మ్యూజిక్ లవర్స్ భారీ అంచనాలు పెట్టేసుకున్నారు.
This post was last modified on August 13, 2024 6:18 pm
వైసీపీ హయాంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులపై పెట్టిన…
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఆరు మాసాలు కూడా కాలేదు. కేవలం ఐదు మాసాలు మాత్రమే పూర్తయింది. కానీ,…
వంశీ పైడిపల్లికి యావరేజ్ డైరెక్టర్ అని పేరుంది. అతను గొప్ప సినిమాలేమీ తీయలేదు. కానీ.. అతను కెరీర్లో ఇప్పటిదాకా పెద్ద…
ఇంకో ఇరవై రోజుల్లో విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ మీద అంచనాలు కొలవాలంటే తలలు పండిన ట్రేడ్…
జనం డబ్బుతో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్, షర్మిల, విజయమ్మ, సునీతలను జగన్ బూతులు తిట్టించారా? అంటే అవును అని…
అగ్ర రచయిత పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తుతం సినిమాలకు రచన చేయకపోయినా కొత్త రిలీజులు చూస్తూ వాటి తాలూకు లోటుపాట్లు, ప్లస్…