Movie News

టాప్ సెలబ్రిటీగా మారిన శోభిత

ఇటీవలే నాగచైతన్యతో నిశ్చితార్థం జరుపుకుని త్వరలో అక్కినేని ఇంటి కోడలు కాబోతున్న శోభిత ధూళిపాళ ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. తాజాగా ఐఎండిబి ప్రకటించిన ఇండియన్ టాప్ సెలబ్రిటీ లిస్టులో షారుఖ్ ఖాన్ ని దాటేసి రెండో స్థానంకి చేరుకోవడం బట్టే తన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ర్యాంక్ శర్వారి కొట్టేసింది. యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న లేడీ స్పై థ్రిల్లర్ లో అలియా భట్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటున్న బ్యూటీ ఈమెనే. అయితే శోభిత ఇంత టాప్ సెలబ్రిటీ మారడం ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా దాని వెనుక కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి.

శోభిత రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ కాదు. చేసేది తక్కువ సినిమాలే అయినా సెలెక్టివ్ గా ఉంటుంది. మేజర్, గూఢచారి, కురుప్, ముతోన్ కొన్ని ఉదాహరణలు మాత్రమే. హాలీవుడ్ లో సంచలనం రేపిన మంకీ మ్యాన్ లో నటించింది. మేడ్ ఇన్ హెవెన్, నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ లు మంచి పేరు తీసుకొచ్చాయి. కల్కి 2898 ఏడి తెలుగు వెర్షన్ లో దీపికా పదుకునేకి డబ్బింగ్ చెప్పింది ఈమెనే. షూటింగ్ పూర్తి చేసుకున్న హిందీ మూవీ సితార విడుదలకు రెడీ అవుతోంది. ఈ లోగా చైతుతో ఎంగేజ్ మెంట్ ఒక శుభవార్త అనుకుంటే ఐఎండిబిలో రేటింగ్ మరో గుడ్ న్యూస్ గా నిలిచింది.

ఐఎండిబి లిస్టు ఎప్పటికప్పుడు మారేదే అయినా జాన్వీకపూర్, కియారా అద్వానీ, కృతి సనన్ లాంటి వాళ్ళను దాటుకుని టాప్ 2లో నిలవడం అనూహ్యం. శోభితకు ఇటీవల బాగా పేరు తెచ్చిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. త్రిష, ఐశ్వర్య రాయ్ లాంటి స్టార్స్ ముందు తన ఉనికిని చాటుకుంది. ఆ తర్వాతే అవకాశాలు పెరిగాయి. చైతుతో కలిసి నటించకపోయినా అతని జీవిత భాగస్వామి అవుతున్నందుకు శోభిత ఆనందం మాములుగా లేదు. బాలీవుడ్ దిగుమతులకు అలవాటు పడిన టాలీవుడ్ నుంచి కాకుండా తెనాలిలో పుట్టిపెరిగిన తెలుగమ్మాయి ఇలా ఎదగడం సంతోషించే విషయమే.

This post was last modified on August 13, 2024 2:22 pm

Share

Recent Posts

మహాశక్తి దర్శనం… ఏఐ దీవెనలు

ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…

2 hours ago

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

3 hours ago

రామాయణ సంగీతానికి తెర లేచింది

విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…

3 hours ago

హైదరాబాద్ లో బాలికను రేప్ చేసిన 8 మంది

మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…

3 hours ago

జైలర్ 2 మీద పందెం కాసేదెవరు

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…

4 hours ago

నిర్మాత రిస్క్ చేశాడు… జాక్‌పాట్ కొడుతున్నాడు

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంత‌కుముందులా ఉదారంగా కొత్త సినిమాల‌ను కొన‌ట్లేద‌న్న సంగ‌తి తెలిసిందే. నిర్మాత‌లు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫ‌ర్…

4 hours ago