ఈ ఏడాది ద్వితీయార్దంలో ఇండియన్ సినిమాలో అత్యధిక అంచనాలున్న వాటిలో ‘కంగువ’ ఒకటి. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్లలో ఒకడైన సూర్య ప్రధాన పాత్రలో.. వీరం, వేదాళం, విశ్వాసం లాంటి మాస్ హిట్స్‌కు పేరు పడ్డ శివ ఈ చిత్రాన్ని రూపొందించాడు.
ముందు ఇది కూడా సగటు మాస్ మూవీనే అనుకున్నారు కానీ.. దీని టీజర్ చూశాక జనాలకు దిమ్మదిరిగిపోయింది. బాహుబలి తరహా భారీ ప్రయత్నం ఇదని అర్థమైంది. దసరా కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుండగా.. ఇప్పటికే ఉన్న అంచనాలను ఇంకా పెంచేసేలా ఈ రోజు ట్రైలర్ వదిలారు. అందులో విజువల్స్.. సూర్యతో పాటు విలన్ బాబీ డియోల్‌ల స్క్రీన్ ప్రెజెన్స్ చూసి జనాలకు మతిపోయింది.
ఇండియన్ స్క్రీన్ మీద ఇది మరో విజువల్ వండర్ కాబోతోందనే సంకేతాలు కనిపించాయి. ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లి ఒక వైల్డ్ రైడ్ చేయించబోతున్నట్లే ఉన్నాడు దర్శకుడు శివ. ట్రైలర్లో చాలా అంశాలు ఆకట్టుకున్నప్పటికీ.. చివర్లో ఒక షాట్ ప్రత్యేకంగా కనిపించింది.
ఒక పాత్రను చూపించి చూపించకుండా ఒక గ్లింప్స్ ఇచ్చాడు దర్శకుడు శివ. హీరో సూర్యను ఢీకొట్టడానికి ఎదురుగా గుర్రం మీద ఓ యోధుడున్నట్లు చూపించారు. ఆ వ్యక్తి ముఖం చూపించకుండా ఆ షాట్ వేసి అభిమానులను ఊరించాడు శివ. ఈ చిత్రంలో సూర్య తమ్ముడు కార్తి కూడా ఓ పాత్రలో కనిపించబోతున్నట్లు ఇప్పటికే సమాచారం బయటికి వచ్చింది.
బహుశా ట్రైలర్ చివర్లో ఇచ్చిన ట్విస్ట్ తన పాత్ర గురించే అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ‘కంగువ’కు సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి భాగంలో బాబీ డియోల్ విలన్ అయితే.. దాన్ని అంతమొందించాక హీరోకు కొత్త సవాల్ ఎదురు కావచ్చని.. అది కార్తితోనే అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. సినిమా చివర్లో సెకండ్ పార్ట్‌కు లీడ్ ఇస్తూ ఈ పాత్రను పరిచయం చేస్తారేమో. అన్నదమ్ముల మధ్య ఎపిక్ క్లాష్ చూడబోతున్న హై ఫీలింగ్‌తో ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటికి వచ్చేలా ప్లాన్ చేశారు కావచ్చు.
This post was last modified on August 13, 2024 10:43 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…