గత ఏడాది బాలకృష్ణ వీరసింహారెడ్డితో విలన్ గా పరిచయమైన కన్నడ హీరో దునియా విజయ్ గుర్తున్నాడుగా. కథానాయకుడిగా శాండల్ వుడ్ లో మంచి పేరున్నప్పటికీ కేవలం బాలయ్య మీద అభిమానంతో నెగటివ్ షేడ్స్ కి ఒప్పుకున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ భర్తగా అందులో తన పెర్ఫార్మన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఆఫర్లు బాగానే వచ్చినప్పటికీ కన్నడలోనే కొనసాగే ఉద్దేశంతో ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మొన్న శుక్రవారం ఇతను దర్శకత్వం వహించిన భీమా రిలీజయ్యింది. ఇది మన గోపీచంద్ మూవీ రీమేక్ కాదు లెండి. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడానికి కారణాలున్నాయి.
నిన్న ఆదివారం బుక్ మై షోలో 76 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా దీనికే ఘనత దక్కింది. కర్ణాటకలో కలెక్షన్లు భారీగా ఉన్నాయి. దీని మీద నమ్మకంతో హైదరాబాద్ తో పాటు కర్నూలు లాంటి పలు నగరాల్లోనూ ఏకకాలంలో రిలీజ్ చేశారు. ఇంతకీ కథేంటంటే బ్లాక్ డ్రాగన్ అనే వాడు బెంగళూరు నగరంలోని యువతకు విపరీతంగా డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళ జీవితాలను దుర్భరం చేస్తాడు. మెకానిక్ గా పని చేస్తూ రౌడీయిజం చేసే భీమాకు వాడి వల్ల కుటుంబపరంగా తీవ్ర నష్టం జరుగుతుంది. దీంతో పోలీసులు వల్ల కానిది తాను చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని డ్రాగన్ ని తుదముట్టిస్తాడు.
సాఫ్ట్ వేర్ సిటీలో మాదకద్రవ్యాలు ఇంత దారుణంగా చెలామణిలో ఉన్నాయా అనిపించే రేంజ్ లో భీమా భయపెడతాడు. విపరీతమైన హింస, డిస్టర్బ్ చేసే విజువల్స్ తో పక్కా ఏ సర్టిఫికెట్ కంటెంట్ ఇచ్చాడు భీమా. కథలో కొత్తదనం లేకపోయినా తెరమీద హింసని ఇష్టపడే వాళ్ళను విజయ్ నిరాశపరచడు కానీ మరీ ఇంత ఓవర్ గా చూపించడం అవసరమా అనిపించేలా కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. గతంలో సలగాని డైరెక్ట్ చేసి ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్న దునియా విజయ్ కి మరో విజయం దక్కినట్టే. వసూళ్లు దాన్నే స్పష్టం చేస్తున్నాయి. కానీ తెలుగులో ఇలాంటివి రిసీవ్ చేసుకోవడం కష్టమే కనక రీమేక్ డౌటే.
This post was last modified on August 12, 2024 4:53 pm
గత ఏడాది టీజర్ కొచ్చిన నెగటివ్ రెస్పాన్స్ దెబ్బకు వీడియో ప్రమోషన్లకు దూరంగా ఉన్న విశ్వంభర ఎట్టకేలకు ఇవాళ హనుమాన్…
ఏపీలోని పొలిటికల్ కేపిటల్ విజవాయడలో శనివారం ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో ఆ…
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ ఆనంద్ షా వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై గ్యాంబ్లింగ్ మాఫియా…
ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న స్పిరిట్ కు రంగం సిద్ధమవుతోంది. చేతిలో ఉన్న ఫౌజీ, ది రాజా సాబ్…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…