రియాలిటీ గేమ్ షోలలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన బిగ్ బాస్ సీజన్ 8కి రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో నాగార్జునే కొనసాగుతున్నారు. ఇటీవలే ప్రమోషన్లు మొదలుపెట్టడమే కాదు పాల్గొనబోతున్న సెలబ్రిటీల లిస్టు కూడా బయటికి ఇచ్చేశారు. తొలి రెండు సీజన్లు జూనియర్ ఎన్టీఆర్, నానిలు హోస్ట్ చేసి డ్రాపయ్యాక అప్పటి నుంచి అప్రతిహతంగా నాగ్ నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం వద్దనుకున్నారని, బాలకృష్ణతో నిర్వాహకులు ఒక దఫా చర్చలు జరిపారనే టాక్ వచ్చింది కానీ అదేమీ నిజం కాలేదు. మన దగ్గర ఎలాంటి సమస్య లేదు కానీ తమిళ్ బిగ్ బాస్ కు చిక్కొచ్చి పడింది.
ఇటీవలే తాను ఈ షో హోస్ట్ చేయలేనంటూ కమల్ హాసన్ తప్పుకోవడం చూశాం. బహిరంగ లేఖ ద్వారా ఆయనే నేరుగా తన అభిమానులకు విషయాన్ని చేరవేశారు. ఇప్పుడీ టీమ్ ప్రత్యాన్మయం కోసం వెతుకుతోంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం విజయ్ సేతుపతి ఆ బాధ్యతను తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందట. సింబు పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ అతనికున్న కమిట్ మెంట్స్ దృష్ట్యా సాధ్యపడకపోవచ్చని అంటున్నారు. మహారాజ బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ సేతుపతి ఇమేజ్, మార్కెట్ రెండూ పెరిగాయి. ఈ అంశం బిగ్ బాస్ బృందానికి ఎలివేషన్ ఇచ్చి ఉంటుంది.
ఇంచుమించు ఒకే సమయంలో తెలుగు తమిళ బిగ్ బాస్ ని మొదలుపెట్టాలని చూస్తున్నప్పటికీ సాధ్యం కాకపోవచ్చు. ప్రతి ఏడాది ఏదో ఒక కాంట్రావర్సి ఉంటున్న ఈ షోని ఇకపై కొత్త తరహాలో నిర్వహిస్తారని అంటున్నారు. అదెలాగో వేచి చూడాలి. కాకపోతే హిందీలోలా విపరీత పోకడలు పోకుండా హద్దుల్లోనే గేమ్స్ ఆడించడం సంతోషించాల్సిన విషయం. అఫ్కోర్స్ నాగార్జున, కమల్, విజయ్ సేతుపతి లాంటి హీరోలు వాటిని ఒప్పుకోరు కానీ సల్మాన్ ఖాన్ మాత్రం అదుపు చేసే ప్రయత్నాలు తక్కువే చేశారు. ఈసారి బిగ్ బాస్ 8లో రాజ్ తరుణ్, వేణు స్వామి లాంటి ఇంటరెస్టింగ్ పార్టిసిపెంట్స్ ఉండబోతున్నారట.
This post was last modified on August 10, 2024 5:01 pm
ఎంత పెద్ద నిర్మాణ సంస్థ అయినా ఒడిదుడుకులు సహజం. కొన్ని బలంగా బౌన్స్ బ్యాక్ అయితే మరికొన్ని కాలగర్భంలోకి కలిసిపోతాయి.…
ఈ సంక్రాంతి ఏపీకి వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే... పండుగకు ముందు ప్రభుత్వం మారింది. కూటమి కొత్త…
సంక్రాంతికి వస్తున్నాం వసూళ్ల ప్రవాహం చూస్తుంటే అరాచకం మాట చాలా చిన్నదనిపిస్తోంది. జనవరి ప్రారంభంలో పండక్కు ముందు గేమ్ ఛేంజర్,…
ఏదో ఒక ప్రత్యేకమైన సందర్భం వస్తే తప్ప కొన్ని బ్లాక్ బస్టర్లకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు బయటికి రావు. నిన్న…
https://youtu.be/y4Rp45vN2O0?si=TR5xlCj2RZGr5bpe సుదీర్ఘ కాలంగా నిర్మాణంలో ఉన్న హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ నుంచి మొదటి ఆడియో…
ఆయన ఏపీ మంత్రి. రాష్ట్ర జలవనరుల శాఖకు అమాత్యుడిగా పనిచేస్తున్నారు. రాజకీయంగా వివాద రహి తుడు. ఆర్థికంగా ఎలాంటి వివాదాలకు…