బాలకృష్ణ యాంకర్ గా టాక్ షోస్ లో సంచలనాలకు నాంది పలికిన అన్ స్టాపబుల్ మూడో సీజన్ కి రంగం సిద్ధమవుతోంది. రెండో సిరీస్ లో కొంచెం పొలిటికల్ ఫ్లేవర్ ఎక్కువ రావడంతో ఈసారి సినీ సెలబ్రిటీలకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టు తెలిసింది. ముఖ్యంగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కలయికలు సాధ్యమవుతాయని యూనిట్ టాక్. వాటిలో మొదటిది మెగాస్టార్ చిరంజీవి కాగా రెండోది నాగార్జునని వినికిడి. ఇండస్ట్రీలో నాకున్న బెస్ట్ ఫ్రెండ్ చిరునే అని గతంలో గౌతమీపుత్ర శాతకర్ణి ప్రమోషన్లలో బాలయ్య చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు.
ఇక నాగార్జున కాంబో కూడా సుదీర్ఘ కాలంగా వెయిటింగ్ లో ఉన్నదే. ఇద్దరి మధ్య ఏవో విబేధాలు ఉన్నాయని పరిశ్రమలో ఎప్పటి నుంచో గుసగుసలున్నాయి. వాటికి పూర్తిగా చెక్ పడిపోబోతోంది. వెంకటేష్ తో సైతం సంప్రదింపులు జరుపుతున్నారు కానీ వెంకీ మామ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఇది కూడా నిజమవ్వొచ్చు. పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, అడవి శేష్ తదితరులంతా ఇప్పటికే పూర్తయ్యారు కనక వీలైనంత కొత్త లిస్టుని సిద్ధం చేయబోతున్నారని తెలిసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని బాలయ్య సన్నిహితుల మాట.
చూస్తుంటే సినిమాలను మించిన అంచనాలను అన్ స్టాపబుల్ 3 మోసుకొచ్చేలా ఉంది.దసరా నుంచి ప్లానింగ్ చేస్తున్నారు కానీ ఇంకా డేట్ నిర్ధారించలేదు. ఆహా ఓటిటి దూకుడు ఈ మధ్యకాలంలో తగ్గింది. కొత్త సినిమాలు సిరీస్ లు రిలీజ్ చేస్తున్నా చందాదారులు పెరిగే దిశగా భారీ కంటెంట్ రాలేదు. ఇప్పుడా లోటుని తీర్చే బాధ్యతని అన్ స్టాపబుల్ 3 తీసుకోవాలి. బాబీ దర్శకత్వంలో ఎన్బికె 109 చేస్తున్న బాలయ్య వచ్చే నెల జరగబోతున్న తన స్వర్ణోత్సవ వేడుకలో కీలకమైన ప్రకటనలు చేస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. వాటిలో వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ముఖ్యమైనదిగా ఉండొచ్చని టాక్.
This post was last modified on August 10, 2024 2:43 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…